న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూజారా స్లో సెంచరీపై విమర్శలు గుప్పిస్తున్న రిక్కీ పాంటింగ్

Ricky Ponting Explains How Cheteshwar Pujaras Inning Could Cost India The Match

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా సెంచరీతో అదరగొట్టాడు. మ్యాచ్‌లో పూజారా చేసిన బ్యాటింగ్‌ తీరుపై ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ విమర్శలకు దిగాడు. మెల్‌బోర్న్‌ తరహా ఫ్లాట్‌ పిచ్‌పై సెంచరీ సాధించేందుకు ఎక్కువ బంతులు తీసుకోవాల్సిన అవసరమేముందుని ప్రశ్నించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 319 బంతులు ఆడిన పుజారా 106 పరుగులను ఆచితూచి సాధించాడు. వికెట్‌ ఇవ్వొద్దన్న ఆలోచనతో ఎక్కువ బంతులు డిఫెండ్‌ చేశాడు.

1
43625
సెంచరీ కోసం అన్ని బంతులు తీసుకోవాలా

సెంచరీ కోసం అన్ని బంతులు తీసుకోవాలా

అతడితో పాటు కోహ్లీ, మయాంక్‌, మిడిలార్డర్‌ ఆటగాళ్లు రాణించడంతో భారత్‌ 443/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. పుజారా కెరీర్‌లో ఇది 17వ సెంచరీ అత్యధిక బంతులు తీసుకున్నదీ దీనికే కావడం గమనార్హం. తొలి వికెట్‌గా వెనుదిరిగిన విహారిని పక్కన పెడితే భారత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన వారందరిలో అతి తక్కువ సగటు పుజారాదే (33.23). ఈ నేపథ్యంలోనే పాంటింగ్‌ విమర్శలు చేశాడు.

బాక్సింగ్ డే టెస్టు సెంచరీతో పుజారా నెలకొల్పిన రికార్డులివే

సెంచరీ కోసమే ఆడినట్లు ఉంది:

సెంచరీ కోసమే ఆడినట్లు ఉంది:

‘భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తే పుజారాది గొప్ప ఇన్నింగ్స్‌. ఆసీస్‌ను వారు రెండు సార్లు ఆలౌట్‌ చేసేందుకు సమయం సరిపోకుంటే అతడే కారణం. అతడు మరో సెంచరీ చేసినట్టు అవుతుందంతే. సిరీస్‌లో పుజారా బాగా ఆడుతున్నాడు. కానీ వేగంగా పరుగులు చేయాల్సిన చోట నెమ్మదిగా ఆడుతున్నాడు. అతడు ఆడుతున్నప్పుడు రన్‌రేట్‌ను ఉరికించడం చాలా కష్టం అనుకుంటున్నా' అని పాంటింగ్‌ అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశ్యం..

అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశ్యం..

మ్యాచ్ అనంతరం పూజారా మీడియా సమావేశానికి హాజరై మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. 'నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఉద్దేశ్యం.. విమర్శకుల నోళ్లు మూయించాలని మాత్రమే కాదు. నాకు జట్టుకు పరుగులు సమకూర్చడం చాలా ఇష్టమైన పని కాబట్టే చేస్తున్నాను. అంతేకానీ, ప్రతి విషయాన్ని పట్టించుకుని వివాదాల్లోకి వెళ్లాలని కాదు. నా పని పరుగులు సాధించడం. నేను అదే చేస్తున్నా. సొంత గడ్డపైనైనా, విదేశీ గడ్డపైన అయినా సరే.

కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా

కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా

ఈ క్రమంలో కొన్ని సార్లు విమర్శలకు గురి కావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా భారత్ విజయాల పరంపరను సాధిస్తే అందరూ సంతోషించే విషయమే కదా. సొంతగడ్డపై పరుగులు సాధించడం కొంచెం తేలికనే చెప్పాలి. కానీ, విదేశీ గడ్డపై పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడాలి. కొన్ని సార్లు అది సాధ్యపడకపోవచ్చు కూడా. ఆసీస్ పర్యటనలో ఇప్పటికీ రెండు సెంచరీలు పూర్తి చేశా. నేను పరుగులు చేయగలననే నమ్మకం నాకుంది. కొన్ని సార్లు విదేశీ గడ్డపై అది సాధ్యపడదంతే'

Story first published: Friday, December 28, 2018, 9:29 [IST]
Other articles published on Dec 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X