బాక్సింగ్ డే టెస్టు సెంచరీతో పుజారా నెలకొల్పిన రికార్డులివే

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్‌మెన్లలో ఛటేశ్వర్ పుజారా(106) సెంచరీతో రాణించగా, విరాట్ కోహ్లీ(82), మయాంక అగర్వాల్(76), రోహిత్ శర్మ(63 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు పుజారా 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలిచిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
2018లోనే అత్యధికంగా పుజారా ఏడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే పుజారా ఇప్పటి వరకు పది హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో పుజారా మూడోస్థానంలో నిలవగా, భారత బ్యాట్స్‌మెన్‌లో రెండో స్థానంలో నిలిచాడు.
సెంచరీ సాధించిన క్రమంలో పుజారా నెలకొల్పిన రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే:

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్
మెల్ బోర్న్ టెస్టులో పుజారా సెంచరీ సాధించడంతో ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పుజారా నాలుగో స్థానంలో నిలిచాడు. 837 పరుగులతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుశాల్ మెండిస్, జో రూట్ ల తర్వాత పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది మూడో సెంచరీ. ఈ సిరిస్‌లో రెండోది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పుజారా 123 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

గంగూలీ రికార్డుని అధిగమించి ఎలైజా జాబితాలోకి పుజారా
టెస్టుల్లో పుజారా మరో 16 పరుగులు చేస్తే మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డుని బద్దలు కొడతాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన 11వ ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందుతాడు. టెస్టుల్లో పుజారా ఇప్పటివరకు 5,233 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీ(16) రికార్డుని పుజారా తాజా సెంచరీతో అధిగమించాడు. అంతేకాదు మాజీ క్రికెట్ దిగ్గజాలు దిలిప్ వెంగ్ సర్కార్, వీవీఎస్ లక్ష్మణ్‌ల 17 సెంచరీల రికార్డుని సమం చేశాడు. భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆస్ట్రేలియాపై నాలుగో సెంచరీ
మెల్‌బోర్న్ టెస్టులో పుజారా 319 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 106 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 17వ సెంచరీ కావడం విశేషం. కాగా, ఈ సిరీస్‌లో రెండోది. ఈ ఏడాది పుజారాకు ఇది మూడో సెంచరీ కాగా, ఆస్ట్రేలియా జట్టుపై నాలుగో సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో 328 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పుజారా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications