న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నస్వామిలో ముంబైకి మెరుగైన రికార్డు: ఆర్‌సీబీ రాత మారేనా?

By Nageshwara Rao
RCB vs MI IPL 2018 Match 31 preview: Mumbai and Bangalore’s fight for survival begins

హైదరాబాద్: మే నెల వచ్చింది. అంటే ఐపీఎల్ సగం పూర్తి అయినట్లే. ఇప్పటికే వరుస విజయాలు సాధించిన చెన్నై, హైదరాబాద్‌, పంజాబ్‌ దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరువలో ఉన్నాయి. మిగతా జట్లు మాత్రం గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి. దీంతో టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.

ఐపీఎల్ 11వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఆ స్థాయి తగ్గ విజయం దక్కించులేకపోయింది. దీంతో ఫ్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాను ఒక్కసారి పరిశీలిస్తే...

ఆరంభం నుంచి తడబడుతోన్న ఆర్‌సీబీ

ఆరంభం నుంచి తడబడుతోన్న ఆర్‌సీబీ

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆర్‌సీబీ ఐపీఎల్ 11వ సీజన్‌లో ఆరంభం నుంచి తడబడుతూనే వస్తోంది. ఫలితంగా ఏడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. జట్టులో మ్యాచ్‌ విన్నర్లు అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువగా కోహ్లీ, డివిలియర్స్‌ మీదే ఆధారపడుతోంది. మరోవైపు ఓపెనర్‌ డికాక్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ బౌలర్లు విఫలం అవుతుండటంతో జట్టు విజయాలను అందుకోలేకపోతుంది.

డివిలియర్స్ దూరమేనా?

డివిలియర్స్ దూరమేనా?

ఇక జ్వరం కారణంగా కోల్‌కతా‌ మ్యాచ్‌కు డివిలియర్స్‌ దూరమయ్యాడు. ఈ క్రమంలో ముంబైతో జరిగే మ్యాచ్‌కు కూడా అతను‌ అందుబాటులో ఉంటాడన్న దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అతనికి బదులుగా గత మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం దక్కించుకున్న మెక్‌కల్లమ్ మెరుపులు మెరిపించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో మెక్‌కల్లమ్‌తో పాటు కోహ్లీ, డికాక్‌ రాణిస్తే ఆర్‌సీబీకి భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.

బెంగళూరును వేధిస్తోన్న పేలవ ప్రదర్శన

బెంగళూరును వేధిస్తోన్న పేలవ ప్రదర్శన

మరోవైపు బౌలర్ల పేలవ ప్రదర్శన బెంగళూరును తీవ్రంగా వేధిస్తోంది. ఎంత భారీ స్కోరు సాధించిన బౌలర్లు విఫలం అవుతుండటం ఆ జట్టుకు ప్రతికూలాంశంగా మారింది. చాహల్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నా, వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. మరోవైపు పేసర్‌ ఉమేశ్‌ ఫామ్‌లో ఉన్నా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఇక, మహమ్మద్ సిరాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ కలిగి ఉన్న ముంబై

బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ కలిగి ఉన్న ముంబై

ఇక, ముంబై ఇండియన్స్‌ విషయానికి వస్తే ఈ సీజన్‌లో పెద్దగా మెరుపులు మెరిపించలేదు. బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌తో బరిలోకి దిగుతున్నా.. కీలక సమయంలో జట్టులోని ఆటగాళ్లు తడబడుతున్నారు. గత మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో పాండ్యా సోదరులు వారి స్థాయికి తగ్గ ఆట ఆడలేదు. దీంతో టాపార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, లూయిస్‌పైనే ముంబై ఎక్కువగా ఆధారపడుతోంది.

చిన్నస్వామిలో బెంగళూరుకు మెరుగైన రికార్డు

చిన్నస్వామిలో బెంగళూరుకు మెరుగైన రికార్డు

బౌలింగ్‌లో బుమ్రా, మెక్లెనగన్‌, మార్కండేలు రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఐపీఎల్‌ ఇరుజట్లు 22సార్లు తలపడగా.. ముంబై 14సార్లు విజయం సాధించగా, ఆర్‌సీబీ 8సార్లు విజయం సాధించింది. మంగళవారం మ్యాచ్ జరుగుతున్న చిన్నస్వామి స్టేడియంలోనూ బెంగళూరుపై ముంబైకి మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు 8సార్లు తలపడగా.. ముంబై ఏడింట విజయం సాధించగా, ఆర్‌సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.

Story first published: Tuesday, May 1, 2018, 17:37 [IST]
Other articles published on May 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X