న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs MI: ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ.. ఆర్‌సీబీకి అదిరే ఆరంభం.. అంతలోనే ఔట్

Aaron Finch completes 14th IPL half century

దుబాయ్: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఓపెనర్ ఆరోన్ ఫించ్ అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ 33 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్‌తో ఈ సీజన్‌లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి మంచి శుభారంభం దక్కింది. హాఫ్ సెంచరీ అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఫించ్(52) బౌల్ట్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో పడిక్కల్(28), కోహ్లీ(2) ఉన్నారు.

ఇక ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఫించ్‌కు రెండు లైఫ్‌లు లభించాయి. వాటిని సద్వినియోగం చేసుకున్న ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్.. ధాటిగా ఆడుతూ ఆర్‌సీబీకి అదిరే ఆరంభాన్నిచ్చాడు. జేమ్స్ పాటిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో ఫించ్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను కృనాల్ పాండ్యా చేజార్చాడు. ఆ వెంటనే బౌల్ట్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని ఫించ్ షార్ట్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. ఈ కష్టతరమైన క్యాచ్‌ను ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న రోహిత్ శర్మ నేలపాలు చేశాడు.

ఆ మరుసటి బాల్‌నే ఫించ్ భారీ సిక్సర్ కొట్టి టచ్‌లోకి వచ్చాడు. ఆ వెంటనే రోహిత్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను దించగా.. ఫించ్ ధాటిగా ఆడుతూ.. హ్యాట్రిక్ ఫోర్స్‌తో 14 పరుగులు పిండుకున్నాడు. ఫించ్‌కు పడిక్కల్ కూడా మంచి సహకారం అందించాడు. ఇక చాహర్ వేసిన 8 ఓవర్‌లో బౌండరీ, సింగిల్‌తో ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఫించ్‌కు ఐపీఎల్‌లో ఇది 14వ హాఫ్ సెంచరీ.

Story first published: Monday, September 28, 2020, 20:23 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X