న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘ఈసాల లోగో చాలా బాగుంది..’ ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ సెటైర్స్

IPL 2020 : Sun Risers Hyderabad Fans Happy With RCB Logo Change
 RCB Unveil New Logo, SunRisers Hyderabad were quick to respond with a cheeky comment

హైదరాబాద్: 'ఈ సాల కప్ నమ్దే'ఈ స్లోగన్ తెలియని ఐపీఎల్ అభిమాని ఉండడు. గత కొన్ని సీజన్‌లుగా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నినాదం ఇది. ఈసారి కప్ మాదే అనే అర్థం కలిగిన ఈ నినాదంతో ఆర్‌సీబీ ప్రతీసారి ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. చివరకు ఫేలవ ఆటతీరుతో ఇదే స్లోగన్‌తో ట్రోలింగ్‌కు గురైంది. ఈ నినాదాన్నే ట్విస్ట్ చేస్తూ అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు.

నిజంగా అదృష్టం.. ఇన్ని మ్యాచ్‌లు ఆడుతాననుకోలేదు : టేలర్నిజంగా అదృష్టం.. ఇన్ని మ్యాచ్‌లు ఆడుతాననుకోలేదు : టేలర్

లోగో మార్పు..

అపకమింగ్ సీజన్‌లోనైనా టైటిల్ అందుకోవాలని భావిస్తోంది. దీనికోసం యాజమాన్యం కూడా చేయాల్సిన కసరత్తులు చేస్తుంది. వేలంలో ఆటగాళ్లపై దృష్టిపెట్టిన జట్టు.. ఇప్పుడు తమ లోగోను మార్చింది. పేరు మారుస్తారిన ఊహాగానాలు వినిపించినా కేవలం లోగో మాత్రమే మార్చింది. ఈ కొత్తలోగో‌ మీ అభిమాన జట్టుకు మధురానుభూతిని ఇస్తుందనుకుంటున్నాం. కొత్త శకం.. కొత్త ఆర్‌సీబీ.. ఇది మా సరికొత్త లోగో అని ట్వీట్ చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్‌సీబీ లోగో మార్చడం ఇది మూడోసారి.

 సన్‌రైజర్స్ సెటైర్స్..

సన్‌రైజర్స్ సెటైర్స్..

ఈ కొత్త లోగోపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘ఈ సాల కప్ నమ్దే' నినాదాన్ని ట్వీట్ చేస్తూ ఈసాల లోగో బాగుందని ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఆరెంజ్ ఆర్మీ కూడా ఇరగదీసెందుకు రెడీ అవుతుందని సుతిమెత్తంగా ఆర్‌సీబీని హెచ్చరించింది.

ఆర్‌సీబీ లోగో మార్చింది కదా.. కప్ మనదే..

ఇక ఆర్‌సీబీ లోగో మార్పుపై హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్‌సీబీ లోగో మార్చిన ప్రతీసారి హైదరాబాద్ చాంపియన్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. 2009, 2016లో ఆర్సీబీ లోగో మార్చిందని, ఈ రెండుసార్లు హైదరాబాద్ చాంపియన్‌గా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

 టైటిలే లక్ష్యంగా..

టైటిలే లక్ష్యంగా..

గత 12 సీజన్లుగా ఆర్‌సీబీకి టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2016లో ఫైనల్‌కి చేరిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచింది. 2017,2018 2019 సీజన్‌లో వరుస పరాజయాల్ని చవిచూసిన ఆ జట్టు.. కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Friday, February 14, 2020, 17:24 [IST]
Other articles published on Feb 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X