న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ.. ఎందుకంటే?

Ravishastri, Mukesh Ambani, Sundar Pichai Together Watched a Match of the Hundred League at Lords

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన ముఖేష్ అంబానీ, మరియు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కలిసి టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ చూస్తు కనిపించారు. సోమవారం ది మెన్స్ హండ్రెడ్ 2022లో భాగంగా ఆతిథ్య లండన్ స్పిరిట్ మరియు మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ని చూడటానికి అంబానీ, పిచాయ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌కు వచ్చారు. ఇక వీరితో పాటు రవిశాస్త్రి కూడా కలిసి మ్యాచ్ ఆస్వాదించారు. ముగ్గురు కలిసి మ్యాచ్ చూశాని ఈ మేరకు ఓ ఫోటోను రవిశాస్త్రి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

క్యాప్షన్‌ ఇస్తూ..

క్యాప్షన్‌ ఇస్తూ..

ఈ ఫోటోకు క్యాప్షన్‌గా ‘హోమ్‌ ఆఫ్ క్రికెట్‌‌గా పిలవబడే లార్డ్స్ గ్రౌండ్లో ముఖేష్ అంబానీ, సుందర్‌ పిచాయ్‌తో కలిసి ది హండ్రెడ్ లీగ్ మ్యాచ్‌ను స్కై క్రికెట్ బ్రాడ్ కస్టర్ తరఫున ఆస్వాదిస్తున్నా' పేర్కొన్నారు. రవిశాస్త్రి ప్రస్తుతం కామెంట్రీ కోసం యూకేలో ఉన్నారు. ప్రస్తుతం అతను స్కై స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇక ది హండ్రెడ్ లీగ్ రెండో ఎడిషన్‌ మ్యాచ్‌లు చాలా బాగా జరుగుతున్నాయి.

పొలార్డ్ 600వ మ్యాచ్ కోసం అంబానీ..?

ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్ వ్యక్తిగత కారణాలతోనో లేక వ్యాపార ప్రయోజనాలతోనో యునైటెడ్ కింగ్‌డమ్‌ వచ్చినట్లు ఉన్నారు. ముఖేశ్ అంబానీ పొలార్డ్ 600వ మ్యాచ్ కోసం వచ్చినట్లు టాక్. పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున కీలక ప్లేయర్ అనే సంగతి తెలిసిందే. ఇక గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సుందర్ పిచాయ్ క్రికెట్ ఆటకు వీరాభిమాని. అతను 2019లో జూన్ 30న ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌కు స్టాండ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.

మూడో ఓపెనర్ ఛాయిస్,నాలుగో పేస్ ఆప్షన్ ఎక్కడ? *Cricket | Telugu OneIndia
తొలుత క్రాలే, పొలార్డ్ చెలరేగడంతో..

తొలుత క్రాలే, పొలార్డ్ చెలరేగడంతో..

ఇక మ్యాచ్ విషయానికొస్తే లండన్ స్పిరిట్ ది హండ్రెడ్ 2022లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. లండన్ స్పిరిట్ మరియు మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య జరిగిన పోటీలో.. లండన్ నిర్ణీత 100బంతుల్లో 6వికెట్లు కోల్పోయి 160పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే 34 బంతుల్లో 41పరుగులు, పవర్-హిట్టర్ కీరన్ పొలార్డ్ 11 బంతుల్లో అజేయంగా 34పరుగులు, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 26బంతుల్లో 37పరుగులు చేసి రాణించారు.

ఇక ఛేదనకు దిగిన మాంచెస్టర్ 108పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 34బంతుల్లో 36పరుగులు చేసి కాసేపు ప్రతిఘటించాడు. స్కిప్పర్ జోస్ బట్లర్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. తద్వారా లండన్ స్పిరిట్ 52పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం లండన్ నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Tuesday, August 9, 2022, 20:15 [IST]
Other articles published on Aug 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X