న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2015లోనే ముంబైకి ఓపెనింగ్ చేయమని రోహిత్‌కు సూచించా: రవిశాస్త్రి

Ravi Shastri suggestion: Told Rohit Sharma to open in 2015 for Mumbai

హైదరాబాద్: 2015లోనే ముంబై జట్టుకి ఓపెనింగ్ చేయమని 'హిట్ మ్యాన్' రోహిత్‌ శర్మకు సూచించా అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి తెలిపారు. రోహిత్‌ టెస్టుల్లో మ్యాచ్ విన్నర్ అవుతాడు. అతడిపై ఒత్తిడి ఏమాత్రం తీసుకురాం. సమయం ఇస్తాం అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. రోహిత్ ఇప్పటివరకు టెస్టుల్లో ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడు. అంజిక్య రహానే, హనుమ విహారీ అద్భుతమైన ప్రదర్శనతో తమ మిడిల్ ఆర్డర్ స్థానాలను పదిలం చేసుకున్నారు. దీంతో రోహిత్‌ను పక్కనపెట్టేశారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో పంత్‌కు చోటు కష్టమే.. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌ కీపర్‌గా సాహా!!దక్షిణాఫ్రికా సిరీస్‌లో పంత్‌కు చోటు కష్టమే.. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌ కీపర్‌గా సాహా!!

ఇక జట్టులో కొనసాగాలంటే రోహిత్‌కు మిగిలి ఉన్న ఏకైక ఆప్షన్ ఓపెనింగ్ చేయడమే. వెస్టిండీస్‌ పర్యటనలో ఓపెనర్ కేఎల్ రాహుల్ విఫలమవడం.. మాజీల మద్దతు ఉండడంతో అతని స్థానంలో రోహిత్ టెస్ట్ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. అక్టోబర్ 2 నుండి ప్రారంభమయ్యే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. మొదటి టెస్టులో మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడాడు.

'2015లోనే ముంబై జట్టుకి ఓపెనింగ్ చేయమని రోహిత్‌కు సూచించా. అతడిలో ఎదో ఉందని ఎప్పుడూ అనుకునేవాడిని. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవారికి ఓపెనింగ్ చేయడం సులభం కాదు. అయితే ఇదంతా ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. ఓపెనింగ్ విషయంలో రోహిత్ గురించి అందరం చర్చించుకున్నాం. రోహిత్ మ్యాచ్ విన్నర్ అవుతాడు. అందుకు తగిన సమయం ఇస్తాం. అతడిపై ఒత్తిడి ఏమాత్రం తీసుకురాం.' అని రవిశాస్త్రి తెలిపాడు.

'2001-02 వెస్టిండీస్ పర్యటనలో వీరేంద్ర సెహ్వాగ్‌ను ఓపెనింగ్ చేయాలని అడిగినప్పుడు అతనితో నేనే మాట్లాడాను. అత్యుత్తమ స్థానం ఇదే అని సెహ్వాగ్‌కు సూచించా. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. ఓపెనింగ్ అనేది ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుందని చెప్పా. ఇప్పుడు రోహిత్‌కు అదే సూచించా' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 27 మ్యాచులు ఆడిన రోహిత్‌ 39.62 సగటుతో 1585 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరి ఓపెనర్‌గా రోహిత్ ఈమేరకు రాణిస్తాడో చూడాలి.

టీమిండియా హెడ్ కోచ్‌ బాధ్యతలు తీసుకున్నది తబలా వాయించడానికా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించాడు. రిషబ్ పంత్ గాడిలో పడే వరకు అతడికి జట్టు మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలుస్తుందని తెలిపాడు. శాస్త్రి మాట్లాడుతూ 'టీమ్ మేనేజ్‌మెంట్ అని చెప్పకండి. ఆటగాళ్లు ఒకే తరహా తప్పులు చేస్తూ పెవిలియన్‌ బాట పడితే వాటిని చక్కదిద్దడానికే నేను ఇక్కడ ఉన్నా' అని అన్నాడు.

Story first published: Thursday, September 26, 2019, 16:46 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X