న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నిబంధనలు లేకుంటే కోహ్లీ చివరి టెస్ట్ ఆడేవాడు: రవిశాస్త్రి

Ravi Shastri Says Virat Kohli would’ve returned for the last Test against Australia if not for quarantine protocols
India tour of Australia : If Rohit Sharma Fit, Can be Included in The Team - BCCI| Ind vs Aus 2020

న్యూఢిల్లీ: క్వారంటైన్ నిబంధనలు లేకుంటే ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండేవాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వ కఠిన ఆంక్షలు వల్ల అతను దూరం కాక తప్పదన్నాడు. ఇక టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ ఖచ్చితంగా మిస్సవుతామన్నాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, కోహ్లీ గైర్హాజరీ వాళ్లకు చక్కని అవకాశామని ఈ టీమిండియా కోచ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రవిశాస్త్రి తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్ ఇన్‌ఫోతో మాట్లాడారు.

సరైన నిర్ణయమే..

సరైన నిర్ణయమే..

విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్‌పై స్పందిస్తూ.. అతని నిర్ణయం సరైందేనని సమర్ధించాడు. ‘గత ఐదారేళ్లుగా టీమిండియా విజయాలను పరిశీలిస్తే వాటి వెనుక కోహ్లీ పాత్ర ఉన్నదనేది సుస్పష్టం. జట్టును ముందుండి నడిపించడంలో అతను సఫలమయ్యాడనే విషయం అందరికీ తెలుసిందే. అలాంటి కెప్టెన్‌ను ఇప్పటి టెస్ట్ సిరీస్‌లో కచ్చితంగా మిస్సవుతాం.

అయితే జీవితంలో అలాంటి మధుర క్షణాలు(తొలి సంతానానికి సంబంధించి) ఆస్వాదించే సమయం మళ్లీ మళ్లీ రాదు. తనకు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి లభించింది. కాబట్టే తిరిగి వెళ్తున్నాడు. అందుకు తనెంతో సంతోషంగా ఉన్నాడనుకుంటున్నా. అతను సరైన నిర్ణయమే తీసుకున్నాడు. అందువల్ల యువ ఆటగాళ్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం లభించింది'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఏకైక ఆసియా సారథి

ఏకైక ఆసియా సారథి

అయితే ఫస్ట్ టెస్ట్ చివరి టెస్ట్‌కు మధ్య 24 రోజుల గ్యాప్ ఉందని, క్వారంటైన్ నిబంధనలు లేకుంటే కోహ్లీకి ఆఖరి టెస్ట్ ఆడే అవకాశం ఉండేదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ‘ఆస్ట్రేలియాలోని క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో కోహ్లీ మళ్లీ తిరుగొచ్చి ఆడటం అంత సులువు కాదు. 14 రోజుల క్వారంటైన్‌లో ఉండటం ఎవరికీ అంత సులువు కాదు. ఆస్ట్రేలియాతో ఇంట బయట గెలిచిన ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీనే అనే విషయాన్ని విమర్శకులు, అభిమానులు గుర్తుంచుకోవాలి.'అని రవిశాస్త్రి తెలిపాడు.

కోహ్లీ గైర్హాజరీతో బొక్కే..

కోహ్లీ గైర్హాజరీతో బొక్కే..

ఇక కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రసవ సమయంలో భార్యకు తోడుగా ఉండేందుకు అతను పెటర్నిటీ సెలవు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17న మొదలయ్యే తొలి టెస్టు తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడు. దీంతో ఆసీస్‌తో జరిగే కీలకమైన టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో విరాట్ నిర్ణయం.. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకోవాలన్న టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్‌ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, November 23, 2020, 19:44 [IST]
Other articles published on Nov 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X