న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్ రేసులో శాస్త్రి ముందున్నాడు: ధోనిని టార్గెట్ చేయడంపై సన్నీ

టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసులో రవిశాస్త్రి ముందున్నాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవి రేసులో రవిశాస్త్రి ముందున్నాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలో రవిశాస్త్రి అందరి కంటే ముందున్నాడని చెప్పాడు.

అంతకముందు టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేసినట్లు ఓ బీసీసీఐ అధికారి తాజాగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఎవరిని ఎంచుకుంటే జట్టంతా సౌకర్యవంతంగా ఫీలవుతుందో... అతనికే క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కోచ్‌ పదవిని కట్టుబెడతోందని సన్నీ చెప్పాడు.

ఇక అధికారికం: కోచ్ పదవికి దరఖాస్తు చేసిన రవిశాస్త్రిఇక అధికారికం: కోచ్ పదవికి దరఖాస్తు చేసిన రవిశాస్త్రి

టీమిండియాతో గతంలో మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందునే రవిశాస్త్రిని తగిన వ్యక్తి అనుకుంటున్నట్లు గవాస్కర్ తెలిపాడు. 2014 ఆగస్టు నుంచి 2016 జూన్‌ వరకు రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే భారత్‌ 22 ఏళ్ల తర్వాత శ్రీలంకపై టెస్టు సిరీస్‌ గెలిచింది.

Ravi Shastri is front-runner to be India Head Coach: Sunil Gavaskar

అంతేకాదు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా టీమిండియా చేజిక్కించుకుందని అన్నారు. మరోవైపు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న సెహ్వాగ్, టామ్ మూడీలను కూడా గవాస్కర్ సమర్ధించాడు. ఐపీఎల్లో పంజాబ్‌కు కోచ్‌గా చేసిన సెహ్వాగ్ తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాడని, ఇక సన్ రైజర్స్‌కు కోచ్‌గా మూడీ సేవలు కూడా అమోఘమని చెప్పుకొచ్చాడు.

అయితే వీరద్దరితో పోలిస్తే రవిశాస్త్రికే అనుభవం ఎక్కువ ఉందని, గతంలోనూ జట్టుతో కలిసి ఉన్నాడని తెలిపాడు. ఇక కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిని గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) జులై 10న ముంబైలో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కొత్త కోచ్ ప్రకటన కూడా ఆరోజే ఉండనుంది.

కంట్రాట్స్: వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన ధోని కంట్రాట్స్: వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన ధోని

మరోవైపు ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓటమికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక్కడినే బాధ్యున్ని చేయడం సమంజసం కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు మొత్తం విఫలమైతే, ధోనినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించాడు.

'నాలుగో వన్డేలో భారత జట్టు ఓటమికి ధోని ఒక్కడే కారణమా. అందరికీ ధోని మ్యాచ్‌ను గెలిపించకపోవడమే కనబడుతుందా. జట్టంతా బ్యాటింగ్‌లో వైఫల్యం చెందడం వల్లే ఓడిపోయింది. ది కరెక్ట్ కాదు' అని గవాస్కర్ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X