న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాట ఇవ్వడం వల్లే!: తబ్రాజ్ షంసీ 'షూ సెలబ్రేషన్' ఎందుకు చేసుకున్నాడో తెలుసా!

IND V SA, 3rd T20I : Rassie Van Der Dussen Reveals Reason Behind Tabraiz Shamsi’s 'Shoe Celebration'
 Rassie van der Dussen reveals an interesting fact about Tabraiz Shamsi’s ‘shoe celebration’

హైదరాబాద్: మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం భారతలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆదివారం టీమిండియాతో బెంగళూరు వేదికగా జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది.

ధర్మశాల వేదికగా జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఇక, మూడో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు సమిష్టి ప్రదర్శన చేసింది. ఫలితంగా సిరిస్ సమం అయింది.

విశాఖకు దక్షిణాఫ్రికా జట్టు: గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌తో వార్మప్ మ్యాచ్విశాఖకు దక్షిణాఫ్రికా జట్టు: గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌తో వార్మప్ మ్యాచ్

ధావన్ వికెట్ తీసిన ఆనందంలో

ధావన్ వికెట్ తీసిన ఆనందంలో

అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ తీసిన ఆనందంలో సఫారీ బౌలర్ తబ్రాజ్ షంసీ వినూత్నంగా 'షూ సెలబ్రేషన్' చేసుకున్నాడు. అయితే, తబ్రాజ్ షంసీ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం వెనుకున్న కారణాన్ని మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.

ముందుగా చెప్పడం వల్లే అలా

ముందుగా చెప్పడం వల్లే అలా

ఈ మ్యాచ్‌లో పెద్ద వికెట్ తీస్తే తన షూ తీసి ఇమ్రాన్ తాహిర్‌కు కాల్ చేస్తానని తబ్రాజ్ షంసీ ముందుగా చెప్పడం వల్లే అలా చేశాడని తెలిపాడు. డస్సెన్ మాట్లాడుతూ "అవును... తబ్రాజ్ షంసీ ఎప్పుడూ ఇమ్మీ(ఇమ్రాన్ తాహిర్)తో ఫోన్‌లో టచ్‌లో ఉంటాడు. తబ్రాజ్ షంసీ హీరోలలో ఇమ్రాన్ తాహిర్ ఒకడు. వారిద్దరూ కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. ధావన్ వికెట్ తీసిన ఆనందంలో షంసీ ఇమ్రాన్‌కు కాల్ చేస్తున్నట్లు షూ తీసి సంబరాలు చేసుకున్నాడు" అని తెలిపాడు.

134 పరుగులు చేసిన టీమిండియా

134 పరుగులు చేసిన టీమిండియా

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అనంతరం 135 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుండే బ్యాట్ ఝళిపించింది. ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్‌లు భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఈ జోడి స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు చేశారు.

76 పరుగులకు తొలి వికెట్

76 పరుగులకు తొలి వికెట్

చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. అయితే పాండ్యా ఓ అద్భుత బంతికి హెండ్రిక్స్ ఔట్ అవ్వడంతో 76 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 28 పరుగులు చేసిన హెండ్రిక్స్.. కోహ్లీ పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.

ఈ సిరిస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు

ఈ సిరిస్‌లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు

మరోవైపు క్రీజులో పాతుకుపోయిన డికాక్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ 79 (52 బంతుల్లో; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. అతనికి బవుమా (27) మంచి సహకారం అందించాడు. చివరలో డికాక్, బావుమా చెలరేగడంతో మరో 19 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

Story first published: Monday, September 23, 2019, 17:52 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X