Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే నితీష్ కుమార్ రెడ్డి ఆడటం లేదు: పాట్ కమిన్స్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగానే నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ ఆడటం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ సందర్భంగా వెల్లడించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కమిన్స్ వెల్లడించాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. వాతావరణం చాలా వేడిగా ఉంది. కాబట్టి మేం బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోరును బోర్డుపై పెట్టాలనుకుంటున్నాం. నాకు పిచ్‌లను సరిగ్గా అంచనా వేయడం రాదు గానీ, ఇది చూడటానికి బాగుంది. కచ్చితంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి.

IPL 2026 Pat Cummins Reveals Why Nitish Kumar Reddy Missed Out on SRH Playing XI Against KKR

యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సీనియర్లు కూడా తమ వంతు బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారు. ఒక్క మ్యాచ్ మినహా మేం ఎప్పుడూ 220 పరుగుల మార్కును అందుకున్నాం. మేం ఆడే ప్రతి మ్యాచ్ గెలవలేమని మాకు తెలుసు. కానీ ఈ శైలి మాకు బాగా కలిసి వస్తోంది. నితీష్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో స్మరణ్ అరంగేట్రం చేస్తున్నాడు. హర్ష్ దూబే స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు.' అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సారథి అజింక్య రహానే తెలిపాడు. 'మేం కూడా ముందుగా చేయాలనుకున్నాం. మాకు లభించిన సుదీర్ఘ విరామం చాలా సహాయపడింది. మేం బాగా రాణించిన విషయాల గురించి, మెరుగుపరుచుకోవాల్సిన విభాగాల గురించి ఆలోచించాం. చిన్న చిన్న క్షణాలను గెలవడమే ఇక్కడ ముఖ్యం. మా జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. టిమ్ సీఫెర్ట్ స్థానంలో ఫిన్ అలెన్ వచ్చాడు. రమణ్‌దీప్ సింగ్ స్థానంలో మనీష్ పాండే తన మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు.'అని రహానే చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కెమెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఈషాన్ మలింగ.

Story first published: Sunday, May 3, 2026, 15:34 [IST]
Other articles published on May 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+