For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్లీల వీడియోలే కొంపముంచాయా? ఒలింపిక్ మెడలిస్ట్‌పై 20 నెలల నిషేధం!

పారిస్ ఒలింపిక్స్ 2024లో పోల్ వాల్ట్ విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన కెనడా అథ్లెట్ అలీషా న్యూమాన్‌కు బిగ్ షాక్ తగిలింది. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఆమెపై 20 నెలల పాటు నిషేధం విధించింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆమె అడల్ట్ కంటెంట వీడియోలు చేయడం వల్ల ఈ నిషేధం పడలేదు. యాంటీ డోపింగ్ నిబంధనలలోని అత్యంత కీలకమైన 'వేర్ అబౌట్స్' నియమాన్ని ఉల్లంఘించినందుకే ఆమెపై ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఒక ఏడాది కాలంలో మూడుసార్లు డోపింగ్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏమిటీ 'వేర్ అబౌట్స్' రూల్?
అంతర్జాతీయ స్థాయిలో ఆడే అథ్లెట్లు తాము ఎక్కడ ఉంటున్నారో, ఏ సమయంలో డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉంటారో ముందే అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనినే 'వేర్ అబౌట్స్' రూల్ అంటారు. అలీషా న్యూమాన్ 2025 ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో తన ఆచూకీ సమాచారం ఇవ్వడంలో విఫలమైంది. అంతేకాకుండా ఆగస్టు 17న జరిగిన ఒక డోపింగ్ పరీక్షకు ఆమె హాజరు కాలేదు. ఇలా 12 నెలల వ్యవధిలో మూడుసార్లు నిబంధనలు అతిక్రమించడంతో ఆమెను 20 నెలల పాటు ఆటకు దూరం చేశారు. ఆమె చివరిసారిగా 2025 మే నెలలో జరిగిన డైమండ్ లీగ్‌లో పాల్గొంది.

Olympic Medalist Alysha Newman Banned for 20 Months Not for OnlyFans Content But Doping Rules

ఆట కంటే వేడుకలతోనే పాపులర్
పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మొదటి కెనడియన్ పోల్ వాల్టర్ అథ్లెట్‌గా అలీషా రికార్డు సృష్టించినప్పటికీ.. ఆమె సాధించిన పతకం కంటే ఆమె చేసుకున్న సంబరాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మెడల్ గెలిచిన వెంటనే మైదానంలో ఆమె చేసిన 'ట్వర్కింగ్'డ్యాన్స్ నెట్టింట సంచలనం సృష్టించింది. ఆ సమయంలో కొందరు ఆమె ఉత్సాహాన్ని మెచ్చుకోగా.. మరికొందరు మైదానంలో ఇలాంటి ప్రదర్శనలు ఏంటని విమర్శించారు. ఏది ఏమైనా.. ఆ ఒక్క డ్యాన్స్‌తో ఆమె గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయింది.

'ఓన్లీ ఫ్యాన్స్'లో స్టార్‌గా అలీషా.. అసలు కారణం ఇదే!
అలీషా న్యూమాన్ కేవలం అథ్లెట్ మాత్రమే కాదు.. అడల్ట్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ 'ఓన్లీ ఫ్యాన్స్'లో కూడా ఓ పాపులర్ స్టార్‌గా కొనసాగుతోంది. క్రీడాకారిణిగా ఉంటూ ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లో ఎందుకు ఉన్నావని ప్రశ్నించగా.. ఆమె బాహాటంగానే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కెనడాలో ఓ అథ్లెట్‌కు శిక్షణ కోసం ఏడాదికి ఇచ్చే 21 వేల డాలర్లు అంతర్జాతీయ స్థాయి సన్నద్ధతకు ఏమాత్రం సరిపోవని ఆమె పేర్కొంది. ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా తనకు లభించే ఆదాయం ఓ గొప్ప స్పాన్సర్‌లా తన కెరీర్‌కు ఉపయోగపడుతోందని వెల్లడించింది. 2024 సెప్టెంబర్ నెలలోనే ఆమె ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా దాదాపు 1.5 కోట్ల రూపాయలు సంపాదించడం గమనార్హం.

Story first published: Sunday, May 3, 2026, 12:51 [IST]
Other articles published on May 3, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+