22 ఏళ్ల క్రికెటర్‌తో 29 ఏళ్ల యాంకర్ ప్రేమాయణం.. క్లారిటీ!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ సమీర్ రిజ్వీ, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ యెషా సాగర్ మధ్య నడుస్తున్నట్లుగా భావిస్తున్న ప్రేమ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి పేర్లు గత కొంతకాలంగా నెట్టింట మారుమోగిపోతున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో, సమీర్ రిజ్వీపై కొన్ని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. యెషా సాగర్‌పై సమీర్ మత మార్పిడి కోసం ఒత్తిడి తెస్తున్నారని.. అలాగే ఆమె సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు విధిస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
బికినీ ఫోటోల డిలీట్ వెనుక సమీర్ ఒత్తిడి?
యెషా సాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి గతంలో అప్‌లోడ్ చేసిన బికినీ ఫోటోలన్నింటినీ తొలగించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. సమీర్ రిజ్వీ ఒత్తిడి చేయడం వల్లే ఆమె ఆ ఫోటోలను తీసివేసిందని వార్తలు గుప్పుమంటున్నాయి. యెషా సాగర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన ఫాలోవర్ల కోసం తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే హఠాత్తుగా కొన్ని పాత ఫోటోలు మాయమవ్వడంతో సమీర్ ఆమెను నియంత్రిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

స్టోరీతో క్లారిటీ ఇచ్చిన యెషా సాగర్
ఈ వివాదం ముదురుతున్న తరుణంలో యెషా సాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించింది. "సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదు" అంటూ ఆమె ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ వివాదంపై ఆమె నేరుగా సమీర్ రిజ్వీ పేరు ఎత్తనప్పటికీ.. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని పరోక్షంగా చెప్పడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సమీర్ రిజ్వీని నెటిజన్లు వదలడం లేదు. ఆమె స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వివాదాల మధ్యే గ్లామర్ పోస్టులు
ఓ పక్క సమీర్ రిజ్వీపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. యెషా సాగర్ తాజాగా పూల్ దగ్గర దిగిన ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల విషయంలోనూ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేసే ప్రతి పోస్ట్ వెనుక సమీర్ రిజ్వీ ప్రమేయం ఉందేమోనని నెటిజన్లు అనుమానిస్తున్నారు. సమీర్ రిజ్వీపై మత మార్పిడి ఆరోపణలు కూడా రావడంతో ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత విషయంగా కాకుండా సామాజిక చర్చగా మారింది. ప్రస్తుతం యెషా సాగర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ పోస్టులు చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications