న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలాగే గెలిచాం, కెప్టెన్ పోరాట పటిమే గెలిపించింది: రషీద్ ఖాన్

Rashid Khan leads good harvest for Sunrisers bowlers; marquee Mumbai Indians batsmen flunk

హైదరాబాద్: ఐపీఎల్ 2018లో భాగంగా జరిగిన హైదరాబాద్, ముంబై మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు.. ముంబై జట్టును చిత్తుగా ఓడించింది. రోహిత్ జట్టుకు చాలా తక్కువ టార్గెట్‌నే ముందుంచి.. బౌలర్ల సత్తాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. హైదరాబాద్ బౌలర్లు మంచి నేర్పును ప్రదర్శించి ప్రత్యర్థి జట్టు వ్యక్తిగత స్కోరు ఒక్కరిది కూడా 30పరుగులు మించకుండా కట్టుదిట్టం చేశారు.

హైదరాబాద్‌ జట్టుకు మరో పరాభవం:

హైదరాబాద్‌ జట్టుకు మరో పరాభవం:

తొలుత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మరో పరాభవం తప్పదని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబై ఇండియన్స్‌పై 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ కాపాడుకుని సంచలన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి కేవలం 11 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన సన్‌రైజర్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.

రషీద్‌ ఏకంగా 16 డాట్‌ బాల్స్‌:

రషీద్‌ ఏకంగా 16 డాట్‌ బాల్స్‌:

రషీద్‌ ఏకంగా 16 డాట్‌ బాల్స్‌ వేయడం గమనార్హం. సిద్ధార్థ్‌ కౌల్‌ 3 వికెట్లు తీయగా, థంపి రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌ అనంతరం రషీద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా బౌలింగ్‌ యాక్షనే నా బలం. ఇతర లెగ్‌ స్పిన్నర్లతో పోల్చితే నా బౌలింగ్‌ కాస్త వేగంగా ఉంటుంది. దాంతో పాటుగా బౌలింగ్‌ వేసేటప్పుడు చేతి కదలిక భిన్నంగా ఉండటంతో బ్యాట్స్‌మెన్లు బంతిని అంచనా వేయడానికి సమయం తీసుకుంటారు. అదే నాకు ప్లస్‌ పాయింట్‌.' అని తెలిపాడు.

విలియమ్సన్‌ నాయకత్వ లక్షణాలకు నిదర్శనం:

విలియమ్సన్‌ నాయకత్వ లక్షణాలకు నిదర్శనం:

'అంతలోనే ప్రత్యర్థి జట్టుకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. మా కెప్టెన్‌ విలియమ్సన్‌ పోరాటం చేసే కెప్టెన్‌. 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం విలియమ్సన్‌ నాయకత్వ లక్షణాలకు నిదర్శనం. గత రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో చేసిన తప్పుల నుంచి ఎంతో నేర్చుకున్నామని' బౌలర్‌ రషీద్‌ వివరించాడు.

తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే రకం:

తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే రకం:

రషీద్ ఖాన్ తప్పుల నుంచి త్వరగా నేర్చుకుంటాడని సునీల్ గవాస్కర్ మ్యాచ్ కు ముందు రోజు మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే రకం. గేల్‌ సునామీ నుంచి తేరుకుని తను మరింత బలంగా వస్తాడు. ఇప్పుడు మళ్లీ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారమే కెప్టెన్లు తుది జట్టును ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది.

Story first published: Wednesday, April 25, 2018, 13:53 [IST]
Other articles published on Apr 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X