న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డు రవి యాదవ్‌ సొంతం

Ranji Trophy: Ravi Yadavs world record hat-trick on opening day of 7th round

హైదరాబాద్: ఇండోర్‌‌లో ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ పేస్ బౌలర్ రవి రమా శంకర్‌ యాదవ్‌ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌ తొలి ఓవర్లోనే 'హ్యాట్రిక్‌' నమోదు చేశాడు. ఉత్తరప్రదేశ్‌తో సోమవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా ఈ ఘనత సాధించాడు.

రవి యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మెన్‌ ఆర్యన్‌ జుయాల్, అంకిత్‌ రాజ్‌పుత్, సమీర్‌ రిజ్వీ పెవిలియన్‌కు చేరారు. తొలిరోజు రవి యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ భారత్ కూడా సాధించలేకపోయాడు.

ఆ రికార్డులో రాహుల్ టాప్.. ఆ తర్వాతే కోహ్లీ, రోహిత్‌!!ఆ రికార్డులో రాహుల్ టాప్.. ఆ తర్వాతే కోహ్లీ, రోహిత్‌!!

గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన రిసీ ఫిలిప్స్‌ 1939-40లో ఇదే విధంగా తాను వేసిన తొలి ఓవర్లో హ్యాట్రిక్‌ సాధించాడు. అయితే, అంతకముందు అతను నాలుగు మ్యాచ్‌లు ఆడి వాటిలో బౌలింగ్‌ చేయక పోవడం విశేషం. కాగా, భారత్‌ తరఫున ఇంతకు ముందు ఏడుగురు బౌలర్లు తమ తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌లు తీశారు.

వీబీ రంజనే, జేఎస్‌ రావు, మహబూదుల్లా, సలీల్‌ అంకోలా, జవగల్‌ శ్రీనాథ్, ఎస్పీ ముఖర్జీ, అభిమన్యు మిథున్‌‌లు ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, తొలిరోజు మధ్యప్రదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులు చేసి ఆలౌటైంది.

Story first published: Tuesday, January 28, 2020, 12:26 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X