న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాడేం లియోనల్ మెస్సీ కాదు.. పక్కనపెట్టామని బాధపడటానికి.. రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు!

Ramiz Raja says Its Not Like We Have Lionel Messi On Bench over Criticism Of Pakistans Batting Unit

కరాచీ: పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జట్టుపై వస్తున్న విమర్శలపై ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఘాటుగా స్పందించాడు. పాకిస్థాన్ జట్టులో ఎలాంటి సమస్యలు లేవని, టైటిల్ సాధించే సత్తా తమ జట్టుకు ఉందని తెలిపాడు. అయినా అంతగా ఫీల్ అవ్వడానికి తాము ఏం లియోనల్ మెస్సీని పక్కకు పెట్టడం లేదన్నాడు. మరో 10 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌కు తెరలేవనుండగా.. పాకిస్థాన్ తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
అయితే ఈమెగా టోర్నీ కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో సీనియర్ మోస్ట్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు చోటు దక్కలేదు. అసలే మిడిల్ ఆర్డర్‌ వీక్‌గా ఉండటంతో మాలిక్‌కు చోటు దక్కకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆ ఇద్దరు ఔటైతే..

ఆ ఇద్దరు ఔటైతే..

షోయబ్ అక్తర్ వంటి మాజీ క్రికెటర్లు మిడిలార్డర్‌పై ఫోకస్ పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ పరాజయం అనంతరం పాక్ జట్టు‌ను చూస్తే భయమేస్తుందని, లీగ్ దశలోనే ఇంటిదారి పట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక పాకిస్థాన్ బ్యాటింగ్ మొత్తం ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లపై ఆధారపడుతోంది. ఈ ఇద్దరూ త్వరగా అవుటైతే మిడిల్ ఆర్డర్‌ నుంచి పెద్దగా పరుగులు రావడం లేదు. ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఈ వీక్‌నెస్ స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే సీనియర్ అయిన షోయబ్ మాలిక్‌ను తీసుకోవాల్సిందని ఆ దేశ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

టీమ్ బాగానే ఉంది..

టీమ్ బాగానే ఉంది..

ఈ విమర్శలపై తాజాగా రమీజ్ రాజా ఘాటుగా స్పందించాడు. 'టీ20 ఫార్మాట్‌లో చాలా ఏళ్లుగా ఆడుతున్నాం. నాకైతే పాక్ క్రికెట్ టీమ్‌ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ఫార్మాట్ ఏదైనా నిలకడైన ప్రదర్శన ఇవ్వాలంటే అది మంచి జట్టును ఎంపిక చేసే సెలక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. కెప్టెన్ కూడా బలంగా ఉండాలి. అయినా అంతగా ఫీల్ అవ్వడానికి బెంచ్‌లో లియోనల్ మెస్సీని ఏం కూర్చోబెట్టడం లేదు. జట్టులో ఉన్న ప్లేయర్లు టాలెంట్ లేకుండా టీమ్‌లోకి వచ్చిన వాళ్లేం కాదు.

యువ ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వడానికే..

యువ ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వడానికే..

పాకిస్థాన్‌ ముందు చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయి. అందుకే ఆప్షన్లు పెంచుకోవడానికి యువకులకు అవకాశాలు ఇవ్వడం చాలా ముఖ్యం. జూనియర్ లెవెల్‌లో టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించడానికి చాలా కృషి చేస్తున్నాం. అలా గుర్తించిన వారికి అవకాశాలు ఇవ్వకపోతే ఫలితం ఏం ఉంటుంది. అదే నా ఫిలాసఫీ... కెప్టెన్ మాత్రం బలంగా ఉంటే సరిపోదు. జట్టుకి ఎంపికయ్యే ప్రతీ ప్లేయర్ కూడా బలంగా మారాలి. అప్పుడే ఎలాంటి టోర్నీ అయినా గెలవచ్చు. ఇప్పుడు మేం చేస్తుంది అదే. ఎవరిని ఆడించాలో మాకు బాగా తెలుసు. నేను చేసినది, ఎవ్వరూ చేయలేదు. రాజకీయ ఒత్తిడులను నేను లెక్కచేయను. టీమ్ ఓడిపోతే అది నా ఓటమి కిందే లెక్క. టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ బెస్ట్ ఫామ్‌లో వెళ్తోంది. వరల్డ్ కప్ గెలిచే సత్తా పుష్కలంగా ఉంది.' అంటూ పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, October 10, 2022, 20:00 [IST]
Other articles published on Oct 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X