న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇషాన్ కిషన్ పొట్టోడే అయినా.. బంతిని గట్టిగానే బాదుతుండు: పాక్ మాజీ క్రికెటర్

Ramiz Raja says Ishan Kishan Doesn’t Have Much Height But He Times The Ball Sweetly
Ind vs Eng 2nd T20I : Ramiz Raja Hails ‘Game Changer’ Ishan Kishan || Oneindia Telugu

కరాచీ: టీమిండియా యువ క్రికెటర్, జార్ఖండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ ఆటగాడి‌కి మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉందని కొనియాడాడు. పొట్టోడు అయినా బంతిని గట్టిగా బాదుతున్నాడని మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్‌తో.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన ఇషాన్ కిషన్(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56).. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతనికి తోడుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా విజృంభించడంతో భారత్ 7 వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

కోహ్లీ అండతో..

కోహ్లీ అండతో..

అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌పై స్పందించిన రమీజ్ రాజా ఈ జార్ఖండ్ కుర్రాడు మ్యాచ్ విన్నరని చెప్పుకొచ్చాడు. 'బ్యాట్‌తో రాణించిన విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపించింది. కానీ నన్ను ఆకట్టుకుంది మాత్రం అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్. స్వేచ్చగా చెలరేగే సామర్థ్యం, నైపుణ్యం అతనిలో పుష్కలంగా ఉంది. అంతేకాకుండా నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలవడంతో ఇషాన్ కిషన్ స్వేచ్ఛగా మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.

 పొట్టిగా ఉన్నా..

పొట్టిగా ఉన్నా..

ఫోర్లు, సిక్సర్లు బాదేయ్.. ఔటైనా ఇబ్బంది లేదు అనేలా టీమిండియా ఇషాన్ కిషన్‌కు లైసెన్స్ ఇచ్చేసినట్లు అనిపించింది. అతనో పవర్ హిట్టర్. వాస్తవానికి చూడటానికి అతను పొట్టిగానే ఉన్నాడు. కానీ.. బంతిని మాత్రం చక్కగా బాదుతున్నాడు. చాలా సందర్భాల్లో ఫోర్ల కంటే సిక్సర్ల కోసమే అతను ప్రయత్నిస్తున్నాడు. ఇషాన్ కిషన్ ఓ గేమ్ ఛేంజర్'' అని కితాబిచ్చాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ టామ్ కరన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లోనూ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ దిశగా సిక్స్ బాదేశాడు. ఇక ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదిన ఇషాన్ కిషన్.. సిక్స్‌తోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.

 సూర్యకు చాన్స్ ఇవ్వడం..

సూర్యకు చాన్స్ ఇవ్వడం..

ఇక ఐపీఎల్‌లో అదరగొట్టిన సూర్య‌కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను భారత జట్టులోకి తీసుకోవడం సరైందేనని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. 'బ్యాటింగ్‌లో మా విధివిధానాలను మార్చుకున్నాం. మీరెళ్లి ఫోర్లు, సిక్స్‌లు బాదండి. ఈ ప్రయత్నంలో మీరు ఔటైనా పర్లేదు'అని లైసెన్స్ ఇచ్చినట్లు యువ ఆటగాళ్ల అరంగేట్రం చూసిన తర్వాత అనిపించింది.'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 మంగళవారం అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది.

Story first published: Monday, March 15, 2021, 20:07 [IST]
Other articles published on Mar 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X