న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుక్లాజీ.. సుంధర్ క్రిస్టియన్ కాదు.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Rajeev Shukla brutally trolled After He pointing out the religion of Indian players in appreciation tweet
Rajeev Shukla's Trolled for Pointing out the Religion of Indian players |Washington Sundar Religion

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ముందు వెనుకా చూసుకోకుండా వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు ట్వీట్ చేస్తే ఇలానే ఉంటుందని అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటలో అద్భుత విజయాన్నందుకున్న భారత జట్టును ప్రశంసిస్తూ రెండు రోజుల క్రితం రాజీవ్ శుక్లా ట్వీట్ చేశాడు.

ముఖ్యంగా ఆస్ట్రేలియా గబ్బా కోటలను బద్దలు కొట్టిన అరంగేట్ర ఆటగాళ్లను ఈ ట్వీట్‌లో ప్రత్యేకంగా అభినందంచాడు. అయితే ఈ ట్వీట్‌లో యువ ఆటగాళ్ల మతాన్ని ప్రస్తావించిన శుక్లాజీ.. సుంధర్ విషయంలో పొరపాటు చేశాడు. దాంతో నెటిజన్లు శుక్లాను ట్రోలింగ్‌తో రోస్ట్ చేశారు.

రాజీవ్ శుక్లా ట్వీట్ ఏంటంటే..?

రాజీవ్ శుక్లా ట్వీట్ ఏంటంటే..?

భారత్‌ జట్టులోని భిన్నత్వంలో ఏకత్వాన్ని తన ట్వీట్ ద్వారా రాజీవ్ శుక్లా తెలియజేసే ప్రయత్నం చేశాడు. వివిధ మతాలకు చెందిన ఆటగాళ్లంతా భారత్‌కు విజయాన్నందించారని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 'రిషభ్ పంత్- హిందూ, మహ్మద్ సిరాజ్- ముస్లిం, శుభ్‌మన్ గిల్- సిక్కు, వాషింగ్టన్ సుందర్-క్రిస్టియన్.. అందరూ కలిసి భారత్‌ను గెలిపించారు. ఈ సందేశాన్ని నా స్నేహితుడు పంపాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?'అని హిందీలో ట్వీట్ చేశాడు.

సుంధర్ క్రిస్టియన్ కాదు..

సుంధర్ క్రిస్టియన్ కాదు..

అయితే శుక్లా ట్వీట్‌లో సుందర్ క్రిస్టియన్ అని పేర్కొన్నాడు కానీ.. అతను హిందువే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ను ఆడుకుంటున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇలాంటి వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు ట్వీట్ చేయడాన్ని నమ్మలేకపోతున్నామని విమర్శిస్తున్నారు. వాషింగ్టన్ సుంధర్ హిందువే అని చెప్పడానికి కావాల్సిన రుజువులను కూడా తమ కామెంట్లకు జత చేస్తున్నారు. ఇలాంటి గలత్ మెసేజ్‌లు ట్వీట్ చేయవద్దని ఘాటుగా విమర్శిస్తున్నారు. పేరులో వాషింగ్టన్ ఉంటే క్రిస్టియన్ అయితారా? అని ప్రశ్నిస్తున్నారు.

వాషింగ్టన్ పేరు ఎలా వచ్చిందంటే..?

వాషింగ్టన్ పేరు ఎలా వచ్చిందంటే..?

ఇక వాషింగ్టన్ సుందర్ పేరు చూసి అందరూ క్రిస్టియన్ అని భావిస్తారు. కానీ సుందర్ హిందూ కటుంబంలోనే జన్మించాడు. అయితే ఆ పేరెందుకు అలా పెట్టుకున్నాడనే విషయంపై సుందర్ తండ్రే ఒకసారి మీడియాకు వివరించాడు. తన చిన్నతనంలో చదువుతో పాటు క్రికెట్‌ మెళకువలను పీడీ వాషింగ్టన్ అనే ఆర్మీ అధికారి నేర్పించాడని, ఆర్థికంగా సాయం చేశాడన్నాడు. ఆయన సాయానికి గుర్తుగానే తన కొడుకుకు వాషింగ్టన్ సుంధర్ అని పేరుపెట్టుకున్నానని తెలిపాడు.

పూర్తి కథనం కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి: వాషింగ్టన్ సుందర్ పేరు వెనుక ఆసక్తికర కథ!

గబ్బాలో గర్జించిన యంగ్ ఇండియా..

గబ్బాలో గర్జించిన యంగ్ ఇండియా..

ఇక గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో భారత్ జట్టు 7 వికెట్లతో గెలుపొంది చరిత్ర సృష్టించింది. 1988 తర్వాత బ్రిస్బేన్​లో ఒక్క మ్యాచ్​ కూడా ఓడని ఆస్ట్రేలియాకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్​లో భారత్ చారిత్రక విజయాన్ని సాధించి బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ ట్రోఫీని నిలబెట్టుకుంది.

నాలుగో ఇన్నింగ్స్​లో 328 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు ఓపెనర్ గిల్ (91), వికెట్ కీపర్ పంత్(89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్​కు తోడు పుజారా (56) అర్ధశతకంతో రాణించారు. అంతకు ముందు సిరాజ్ ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. ఇక భారత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుంధర్ విలువైన భాగస్వామ్యాన్ని అందించారు.

Story first published: Wednesday, January 27, 2021, 14:45 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X