RR Probable Squad For IPL 2022: రాజస్థాన్‌లోకి దీపక్ చాహర్, జాసన్ హోల్డర్.. పూర్తి జట్టు ఇదే!

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో జరిగే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) సమాయత్తం అవుతోంది. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటుంది. అప్పుడెప్పుడో ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో టైటిల్ గెలిచిన ఆ జట్టు మళ్లీ ఇప్పటి వరకు ఆ ముచ్చట తీర్చుకోలేకపోయింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఎందరో ఆటగాళ్లు వచ్చిపోతున్నా ఆ జట్టు రాత మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే ఈ సారైన టైటిల్ కొట్టాలనే కసితో రాజస్థాన్ ఉంది. అందులో భాగంగానే మెగావేలంలో సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలనుకుంటుంది.

అందుకు తగ్గట్లుగానే రాజస్థాన్ రాయల్స్ దగ్గర రూ. 62 కోట్ల పర్స్ మనీ ఉంది. రిటెన్షన్ ప్రక్రియలో కెప్టెన్ సంజూ శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్(రూ.10 కోట్లు), అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ (రూ.4 కోట్లు)లను మాత్రమే తీసుకున్న రాజస్థాన్ రూ.28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. రిటైన్ ఆటగాళ్లతో ఓపెనింగ్, కెప్టెన్, వికెట్ కీపర్ స్లాట్స్‌ ఫిల్ అవ్వగా.. మిడిలార్డర్, ఆల్‌రౌండర్స్, పేసర్స్, స్పిన్నర్లతో 8 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.

మెగా వేలంలో భారీ ధర పలికే ఆటగాళ్లుగా భావిస్తున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల అవసరం వీళ్లకు లేకపోవడం ప్లస్ పాయింట్. వీరి దగ్గర ఉన్న డబ్బులతో మంచి కోర్ టీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్‌ లోకల్ బాయ్ దీపక్ చాహర్, తమ ఫ్రాంచైజీకి చెందిన సీపీఎల్ జట్టులో ఉన్న జాసన్ హోల్డర్ కోసం డబుల్ ఆర్ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. వేలంలో రాజస్థాన్ టార్గెట్ చేసే ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

పాత ఆటగాళ్లలో...

పాత ఆటగాళ్లలో...

తమ మాజీ ఆటగాళ్లు అయిన రాహుల్ తెవాటియా, చేతన్ సకారియా, లివింగ్ స్టోన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎవిన్ లూయిస్, కార్తీక్ త్యాగీ, రియాన్ పరాగ్‌ల కోసం రాజస్థాన్ ప్రయత్నించే అవకాశం ఉంది. వీలైనంతవరకు ఈ జాబితాలో ఆటగాళ్లను వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. పైగా ఇందులో సకారియా, ముస్తాఫిజుర్ మినహా మిగతా ఆటగాళ్లకు అంతగా డిమాండ్ లేదు.

తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్‌తో ఓపెనింగ్ స్లాట్.. సంజూ శాంసన్‌తో ఫస్ట్ డౌన్ స్లాట్ ఫిల్ అవడంతో వారికి ఈ మూడు స్థానాల్లో పెద్ద ప్లేయర్లు అవసరంలేదు. కాకపోతే బ్యాకప్‌గా జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో వంటి ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు.

మిడిలార్డర్‌లో మలాన్, మనీశ్ పాండే

మిడిలార్డర్‌లో మలాన్, మనీశ్ పాండే

ఇక మిడిలార్డర్‌లో లివింగ్ స్టోన్, హెట్‌మైర్, డేవిడ్ మలాన్, చరిత్ అసలంక, రాసీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్లను రాజస్థాన్ టార్గెట్ చేయవచ్చు. అయితే ఈ జట్టు ఓనర్, డైరెక్టర్ ఇంగ్లీష్ వాళ్లు కావడంతో ఆ ప్లేయర్లకే ఎక్కువ ప్రాధాన్యత లభించనుంది.

అంతేకాకుండా టీమ్ డైరెక్టర్‌గా శ్రీలంక దిగ్గజం సంగక్కర ఉన్న నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లకు కూడా ప్రిఫరెన్స్ దక్కనుంది. భారత మిడిలార్డర్ ఆటగాళ్లలో రియాన్ పరాగ్, మనీశ్ పాండే, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, షారూఖ్ ఖాన్, దీపక్ హుడా, అంబటి రాయుడు, శివమ్ దూబే వంటి ప్లేయర్లను టార్గెట్ చేయవచ్చు.

చాహర్ బ్రదర్స్‌పై గురి..

చాహర్ బ్రదర్స్‌పై గురి..

ఇక ఆల్‌రౌండర్స్‌గా.. జాసన్ హోల్డర్, జిమ్మీ నీషమ్, మిచెల్ మార్ష్, ఓడియన్ స్మిత్, రాహుల్ తెవాటియా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుంధర్‌‌ల కోసం ప్రయత్నించవచ్చు. పేసర్లుగా చేతన్ సకారియాతో పాటు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శివమ్ మావి, మహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్, కార్తీక్ త్యాగీ, ప్రసిధ్ కృష్ణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ప్యాట్ కమిన్స్, లూకీ ఫెర్గూసన్, కగిసో రబడా, మార్క్ వుడ్, ట్రెంట్ బౌల్ట్, టైమల్ మిల్స్‌‌ను టార్గెట్ చేయవచ్చు.

లోకల్ భాయ్ దీపక్ చాహర్ కోసం రాజస్థాన్ ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్లలో అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్‌లలో ఒకరి కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. రాజస్థాన్‌కే చెందిన రాహుల్ చాహర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

IPL 2022 : Top 10 Most Curious Batsman In IPL History | Oneindia Telugu
రాజస్థాన్ రాయల్స్ టీమ్(అంచనా)

రాజస్థాన్ రాయల్స్ టీమ్(అంచనా)

జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), మనీశ్ పాండే, లియామ్ లివింగ్ స్టోన్, విష్ణు వినోద్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మురుగన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, టైమల్ మిల్స్, సాయి కిషోర్, ప్రియామ్ గార్గ్, ఆసిఫ్, టామ్ బాటన్, జియోర్జ్ గార్టన్, విరాట్ సింగ్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, February 9, 2022, 9:42 [IST]
Other articles published on Feb 9, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X