న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనకు ఓ హెచ్చరిక: పనిభారంపై కమిన్స్ వ్యాఖ్యలను ఉటంకించిన ద్రవిడ్

ICC Cricket World Cup 2019 : Rahul Dravid Believes Defeat To Australia Will Help Team India
Rahul Dravid believes series defeat against Australia will help Team India do well at World Cup

హైదరాబాద్: వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓటమి టీమిండియాకు ఓ హెచ్చరికలాంటిదని రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌పై 2-0తో ఆధిక్యంలో ఉండి కూడా భారత్‌ సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా ప్రపంచకప్‌లో పోటీపడుతున్న కోహ్లీ సేన.. చాలా జాగ్రత్తతో ఆడాల్సి ఉంటుందని అన్నాడు. గతఫామ్‌ను చూసి మురిసిపోవద్దనీ, ప్రస్తుతం ఎలా ఆడుతున్నామన్నదే ప్రధానమని బుధవారం ఓ కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్‌ చెప్పాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టీమిండియా అద్భుత ప్రదర్శన

టీమిండియా అద్భుత ప్రదర్శన

"గత కొన్నేళ్లలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. చాలా సిరీస్ లలో నెగ్గి వన్డే క్రికెట్‌లో మన ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. దీంతో పటిష్ఠ బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైన్‌పతో కూడిన భారత జట్టు రానున్న వరల్డ్‌ కప్‌లో కచ్చితంగా ప్రపంచకప్‌ గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నాం. ఆ నేపథ్యంలో సిరీస్‌ పరాజయం మంచిదే. ప్రపంచకప్‌లో మనం చాలా బాగా ఆడాల్సిన అవసరాన్ని ఆ సిరీస్‌ ఫలితం గుర్తు చేసింది" అని ద్రవిడ్ అన్నాడు.

కోహ్లీసేన చాలా శ్రమించాలి

కోహ్లీసేన చాలా శ్రమించాలి

"మెగా ఈవెంట్‌లో రాణించాలంటే ఎంతో అద్భుతంగా ఆడాలన్న విషయాన్ని ఆ ఓటమి గుర్తుచేస్తోంది. కప్పు నెగ్గేందుకు కోహ్లీసేన చాలా శ్రమించక తప్పదు. భారత్‌ ఫేవరెట్‌ అనడం లో సందేహం లేదు. మన జట్టు ఇప్పటికీ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటన్నది నా అభిప్రాయం. ఇంగ్లండ్‌లో పరిస్థితులు అంత సులభంగా ఉండవు. మ్యాచ్‌లు చాలా కఠినంగా సాగుతాయి. కానీ కష్టపడక తప్పదు. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది" అని ద్రవిడ్ చెప్పాడు.

పనిభారం కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి

పనిభారం కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి

పంచకప్‌ నేపథ్యంలో పనిభారం కారణంగా కొం దరు ఆటగాళ్లకు ఐపీఎల్‌ నుంచి విశ్రాంతి ఇవ్వాలన్న వ్యాఖ్యలపై కూడా ద్రవిడ్ స్పందించాడు. "ఈ విషయంలో చాలా మంది క్రికెటర్లకు అవగాహన ఉంటుంది. తమ శరీరం ఎంత మేర పని భారాన్ని తట్టుకుంటుందన్నది వాళ్లకు తెలుసు. ఎవరూ కూడా తమ దేహం తట్టుకోలేనంత స్థాయిలో ఆడరని అనుకుంటున్నా" అని ద్రవిడ్ తెలిపాడు.

ఒక్కో ఆటగాడిగా ఒక్కోలా ఉంటుంది

ఒక్కో ఆటగాడిగా ఒక్కోలా ఉంటుంది

"విశ్రాంతి తీసుకుని రావడం కంటే, క్రమం తప్పకుండా ఆడుతుంటేనే తాను మెరుగ్గా బౌలింగ్‌ చేయగలనని ఆస్ట్రేలియా పేసర్‌ కమిన్స్‌ అన్నాడని ఎక్కడో చదివా. కాబట్టి పని భారం అనేది ఒక్కో ఆటగాడిగా ఒక్కోలా ఉంటుంది. అందరికీ విశ్రాంతినిచ్చేలా ఓ విధానాన్ని రూపొందించడం కుదరదు. మనం ఆటగాళ్లను నమ్మాలి. ఏం చేయాలో వాళ్లకు తెలుసు" అని ద్రవిడ్‌ చెప్పాడు.

Story first published: Thursday, March 21, 2019, 11:18 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X