న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ పర్యటనలో ఆ ‘ఘోర తప్పిదాల’ను పునరావృతం చేయం: కోహ్లీ

Radical mistakes of England tour will be cut down against Australia: Kohli

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ పర్యటనలో 'ఘోర తప్పిదాలు' చేయడం వల్ల అందర్నీ నిరాశ పరిచామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 బుధవారం జరగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-4తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌లో మా పొరపాట్లు చాలా ఘోరమైనవి. నాణ్యమైన క్రికెట్‌ ఆడినా ఘోర తప్పిదాలు చేయడంలో మ్యాచ్‌లు ఓడిపోయాం. ప్రత్యర్థి జట్టుతో సమానంగా ఆడగల సామర్థ్యం మా జట్టుకు ఉంది. టెస్టు క్రికెట్‌లో తక్కువ తప్పులు చేసిన జట్టే విజయం సాధిస్తుంది. అదే సాధారణ సూత్రం" అని అన్నాడు.

 ఆసీస్ సిరిస్‌లో మా పొరపాట్లు తగ్గేలా దృష్టిసారిస్తున్నాం

ఆసీస్ సిరిస్‌లో మా పొరపాట్లు తగ్గేలా దృష్టిసారిస్తున్నాం

"ఆస్ట్రేలియా సిరీస్‌లో మా పొరపాట్లు తగ్గేలా దృష్టిసారిస్తున్నాం. మా పరిస్థితి బాగాలేనప్పుడు వీలైనంత త్వరగా పరిష్కారం వెతకాలి. జట్టుగా సమస్య నుంచి బయటపడాలి. గత పర్యటనలో మంచి క్రికెట్‌ ఆడాం, కానీ మ్యాచ్‌లు గెలవలేదు. ఈ సారి దానిని మార్చాలని అనుకుంటున్నాం. మ్యాచ్‌లతో పాటు సిరీస్‌ గెలిచేందుకు ప్రయత్నిస్తాం" అని కోహ్లీ చెప్పాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ఆ తర్వాత నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరిస్ జరగనుంది. కాగా, తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డు కోసం పోటీపడబోతున్నారు.

 అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా

అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచేందుకు రోహిత్ శర్మ ఇంకో 65 పరుగులు చేయాల్సి ఉండగా.. విరాట్ కోహ్లి 170 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ (2271)అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

 87 మ్యాచ్‌ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో రోహిత్

87 మ్యాచ్‌ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో రోహిత్

75 మ్యాచ్‌ల్లో గుప్తిల్ ఈ స్కోరుని సాధించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 87 మ్యాచ్‌ల్లో 2,207 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ 108 మ్యాచ్‌ల్లో 2,190 పరుగులతో మూడో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 71 మ్యాచ్‌ల్లో 2,140 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈజాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 2,102 పరుగులతో ఉన్నాడు.

Story first published: Wednesday, November 21, 2018, 12:15 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X