న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వింటన్ డికాక్‌కు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు!!

Quinton De Kock named South Africas male Cricketer of the Year


జొహన్నెస్‌బర్గ్‌:
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన డికాక్‌.. తాజాగా 'దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'గా నిలిచాడు. డికాక్‌ 2017లోనూ ఈ అవార్డును గెలుచుకున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో మహిళల కేటగిరీలో లారా వోల్వార్ట్‌ 'క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డును గెలుచుకున్నారు.
దిగ్గజాల సరసన చోటు:

దిగ్గజాల సరసన చోటు:

ఎనిమిదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో డికాక్‌ ఇప్పటివరకు 47 టెస్టుల్లో, 121 వన్డేల్లో, 44 టీ20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు డికాక్‌ కెప్టెన్సీలో ఎనిమిది వన్డేలు ఆడిన దక్షిణాఫ్రికా.. నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టీ20ల్లో డికాక్‌ నేతృత్వంలో దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. మూడింటిలో గెలిచి, ఐదింటిలో ఓటమి చవిచూసింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండోసారి గెలుచుకున్న డికాక్.. జాక్వెస్‌ కలిస్‌ (2004, 2011), మఖాయ ఎన్తిని (2005, 2006), హషీమ్‌ ఆమ్లా (2010, 2013), ఏబీ డివిలియర్స్‌ (2014, 2015), కగిసో రబడ (2016, 2018)ల సరసన చేరాడు.

టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ కూడా:

టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ కూడా:

క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) వార్షిక అవార్డుల్లో 27 ఏళ్ల వికెట్‌ కీపర్, బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ మరో అవార్డును కూడా గెలుచుకున్నాడు. పురుషుల 'క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డుతో పాటు 'టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారం దక్కించుకున్నాడు. పేసర్‌ లుంగీ ఇన్‌గిడి 'వన్డే, టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డులను గెలుచుకోగా.. డేవిడ్‌ మిల్లర్‌ 'ఫేవరెట్‌ ప్లేయర్‌'గా నిలిచాడు.

కెప్టెన్‌గా మారిన తర్వాత:

కెప్టెన్‌గా మారిన తర్వాత:

కెప్టెన్‌గా మారిన తర్వాత డికాక్ ప్రదర్శన ఎంతో మెరుగుపడింది. ఎంతలా అంటే.. చివరి ఏడు సిరీస్‌ల్లో ఏకంగా ఐదు సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. జట్టు టాప్ ఆర్డర్‌పరంగా చూసుకుంటే చివరి 27 ఇన్నింగ్స్‌లలో 9 సార్లు డికాక్ టాప్ స్కోరర్. అయితే దక్షిణాఫ్రికా గెలిచిన ఏకైక సిరీస్‌లో డికాక్ ఫెయిలయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని దక్షిణాఫ్రికా 3-0తో గెలవగా.. ఆ సిరీస్‌లో డికాక్ రాణించలేకపోయాడు.

భారత్‌తో వన్డే సిరీస్‌ ఆడేందుకు:

భారత్‌తో వన్డే సిరీస్‌ ఆడేందుకు:

దక్షిణాఫ్రికా జట్టు ఈ ఏడాది మార్చిలో భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు కాగా.. కరోనా వైరస్ కారణంగా మిగతా రెండు వన్డేలు రద్దవడంతో స్వదేశానికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆ టీమ్ ఆడలేదు. ఇప్పుడిప్పుడే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

మరోసారి ధావన్‌ గొప్ప మనసు.. ఈసారి క్రికెట్‌ కిట్లు!!

Story first published: Monday, July 6, 2020, 7:46 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X