న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీల మోత సృష్టిస్తోన్న యువ కెరటాలు

Prithvi Shaw, Shreyas Iyer smash centuries as Mumbai post 400, become second Indian domestic team to breach that mark

న్యూఢిల్లీ: భారత అండర్ 19 కెప్టెన్, ఓపెనర్ పృథ్వీ షా (129) లిస్ట్-ఏ క్రికెట్లో తొలి సెంచరీ బాదిన వేళ.. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై 5 వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో ముంబైకి ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత క్రికెట్లో 400 పరుగుల మార్కు దాటిన రెండో దేశవాళీ జట్టుగా రికార్డ్ నెలకొల్పింది.

2010లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టు 50 ఓవర్లలో 412 పరుగులు చేసింది. ఇరు జట్లూ రైల్వేస్‌పైనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. లిస్ట్-ఏ క్రికెట్లో తొలి సెంచరీని షా కేవలం 61 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. 14 ఫోర్లు, 6 సిక్సుల బాదిన ఈ యువ ఓపెనర్ 81 బంతుల్లో 129 పరుగులు చేశాడు.

ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోన్న టీమిండియాఫేవరేట్‌గా బరిలోకి దిగుతోన్న టీమిండియా

శ్రేయాస్ అయ్యర్ (118 బంతుల్లో 144) కూడా సెంచరీ బాదడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. గత మ్యాచ్‌లో 149 పరుగులు చేసిన కెప్టెన్ రహానే.. ఆదివారం రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులకే అవుటై నిరాశపరిచాడు.

మరో పక్క టీమిండియా ఆసియా కప్‌లో పాక్ జట్టుపై పంజా విసరనుంది. ఈ క్రమంలో.. ఆదివారం పాక్‌తో తలపడనున్న భారత్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. పాకిస్తాన్ మాత్రం టోర్నీలో మ్యాచ్ గెలిచేందుకు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. కానీ, భారత్-పాక్ మ్యాచ్ అంటే పరిస్థితులను ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే ఇదే టోర్నీలో దాయాది జట్ల మధ్య రెండో సారి జరగనున్న మ్యాచ్‌పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

Story first published: Sunday, September 23, 2018, 16:05 [IST]
Other articles published on Sep 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X