న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్టుకు సలహా: తొలి టెస్టు ఓటమిపై మాజీ క్రికెట్ దిగ్గజం పాంటింగ్

Ponting suggests Australia not change team combination for Perth Test

హైదరాబాద్: నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పెర్త్ మైదానం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అనుకూలంగా ఉంటుందని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి రెండో టెస్టు జరగనుంది.

ప్రతి మ్యాచ్ ముగింపులానే ఉంటుంది: గంగూలీప్రతి మ్యాచ్ ముగింపులానే ఉంటుంది: గంగూలీ

ఈ నేపథ్యంంలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ "పెర్త్‌ మైదానం టీమిండియా కంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కానీ, ఆతిథ్య జట్టు ఆటగాళ్లు త్వరగా తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకొని రెండో మ్యాచ్‌కు సిద్ధం కావాల్సి ఉంది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా చెత్తగా ఆడారు" అని అన్నాడు.

1
43624
30 పరుగుల్లోపే ఔటై పెవిలియన్‌‌కు

30 పరుగుల్లోపే ఔటై పెవిలియన్‌‌కు

"30 పరుగుల్లోపే ఔటై పెవిలియన్‌ బాట పట్టారు. దాని అర్థం భారత్‌ బాగా ఆడిందని కాదు. వారు కూడా పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అయితే తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు కొన్ని సానుకూల‌ అంశాలు కూడా ఉన్నాయి. జట్టును మార్చకుండా రెండో టెస్టుకు సైతం ఇదే కూర్పును కొనసాగించాలి. ఆటగాళ్లను మారిస్తే వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు.

31 పరుగుల తేడాతో భారత్ విజయం

31 పరుగుల తేడాతో భారత్ విజయం

చివరి వరకు ఆసక్తికరంగా సాగిన అడిలైడ్ టెస్ట్‌లో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 104/4తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌటైంది.

మూడు వికెట్లు తీసిన షమీ, అశ్విన్

మూడు వికెట్లు తీసిన షమీ, అశ్విన్

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/68), మహమ్మద్ షమీ(3/65), రవిచంద్రన్ అశ్విన్ (3/92) మూడేసి వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇషాంత్‌శర్మ(1/48)కు ఒక వికెట్ దక్కింది. షాన్ మార్ష్(60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా కెప్టెన్ టిమ్ పైన్(41) ఫర్వాలేదనిపించాడు. చివర్లో నాథన్ లియాన్(38 నాటౌట్) గెలుపుపై ఆశలు రేపాడు.

 పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

భారత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి. గత 11 పర్యాయాలు రెండు సార్లు డ్రా, 9 సార్లు ఓటములు ఎదుర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనకు భిన్నంగా ఇంగ్లాండ్‌లో(1986), దక్షిణాఫ్రికాలో(2006) ఒకసారి, న్యూజిలాండ్‌లో మూడుసార్లు, విండిస్ రెండుసార్లు తొలి టెస్ట్‌లో భారత్ విజయాలు సాధించింది.

Story first published: Tuesday, December 11, 2018, 10:07 [IST]
Other articles published on Dec 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X