న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup: శ్రీలంకలో 2021.. పాకిస్థాన్‌లో 2022!

PCB CEO Wasim Khan says Asia Cup 2021 to be held in Sri Lanka, Pakistan have rights for 2022 edition

కరాచీ: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఆటలన్నీ ఆగమాగమైన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌, ఆసియా కప్ 2020 వాయిదా పడ్డాయి. పాకిస్థాన్ వేదికగా ఈ ఏడాది ఆసియా కప్‌ జరగాల్సింది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడటంతో.. కొత్త షెడ్యూల్, వేదికల మార్పు విషయమై కొద్ది నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ మెగాటోర్నీ నిర్వహణ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 2021 ఆసియాకప్‌ను శ్రీలంక నిర్వహిస్తే 2020లో పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చేందుకు రెండు జట్లు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

2022 పాక్‌లోనే..

2022 పాక్‌లోనే..

ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీం ఖాన్ వెల్లడించారు. 2021 జూన్‌లో శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరుగుతుందని, ఆ తర్వాతి ఏడాది తమ దేశంలో ఆసియా కప్ నిర్వహిస్తామని తెలిపారు. ‘షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఆసియా కప్‌ షెడ్యూల్ 2021 జూన్‌కు మార్చారు. వచ్చే ఏడాది ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2022 ఎడిషన్‌ ఆతిథ్య హక్కులు పాక్‌కు దక్కాయి.'అని వసీం ఖాన్ తెలిపాడు.

ఉగ్రదాడి నేపథ్యంలో..

ఉగ్రదాడి నేపథ్యంలో..

పదేళ్ల క్రితం పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగింది. లంక ఆటగాళ్లు ప్రయాణిస్తోన్న బస్సుపై ముష్కరుల కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత అంతర్జాతీయ జట్లు ఆ దేశానికి వెళ్లడానికి జంకుతున్నాయి. అయితే గతేడాది శ్రీలంక జట్టే పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఆ తర్వాత కాలంలో జింబాబ్వే, బంగ్లాదేశ్ పాక్ గడ్డ మీద పర్యటించాయి. భారత్‌తోపాటు కొన్ని ఇతర జట్లు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు సుముఖంగా లేవు.

భారత్ మొండిపట్టు..

భారత్ మొండిపట్టు..

2022లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటించేలా పీసీబీ ఒప్పించింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ జట్టు కూడా పాక్‌లో పర్యటించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఇంగ్లిష్ జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 ఆసియా కప్ వాయిదా పడక ముందు.. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌ వెళ్లబోమని బీసీసీఐ తెలిపింది. పాక్ బదులుగా తటస్థ వేదికైన యూఏఈలో టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టింది. 2022కు ఆసియా కప్ వాయిదా పడటంతో.. అప్పటికైనా బీసీసీఐ మనసు మార్చకుంటుందనే ఆశతో పీసీబీ ఉంది. కానీ బీసీసీఐ ఇదే పట్టుదలతో ఉంటే.. మాత్రం వేదిక మార్చాల్సిన పరిస్థితి రావచ్చు.

Story first published: Friday, December 4, 2020, 12:05 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X