న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ భాయ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్.. డేంజరేస్ పూరన్ డైమండ్ డక్!

PBKS vs SRH: David Warner Gets Dangerous Nicholas Pooran For A Duck
IPL 2021,SRH VS PBKS : David Warner సూపర్ త్రో.. Nicholas Pooran's Diamond Duck | Oneindia Telugu

చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. రెప్పపాటు క్షణంలో బంతిని వికెట్లకు హిట్ చేసి డేంజరస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌(0)ను పెవిలియన్ చేర్చాడు. డేవిడ్ భాయ్ సూపర్ త్రోకు ఒక్క బంతి కూడా ఆడకుండానే పూరన్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్‌పై ఆరెంజ్ ఆర్మీ పట్టు బిగించింది.

విజయ్ శంకర్ వేసిన 8వ ఓవర్ తొలి బంతిని క్రిస్ గేల్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న వార్నర్ బంతిని అందుకొని నేరుగా వికెట్లకు కొట్టేసాడు. అయితే బంతి వికెట్లను తాకే విషయంలో సందేహం వ్యక్తం చేసిన థర్డ్ అంపైర్ పలుకోణాల్లో పరిశీలించి ఔటిచ్చేశాడు. దాంతో పూరన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో పూరన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌటయ్యాడు.

ఇందులో ఒక గోల్డెన్ డక్ కూడా ఉంది. రాజస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో చేతన్ సకారియా థ్రిల్లింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత చెన్నైతో డకౌటైన పూరన్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో 9 రన్స్ మాత్రమే చేశాడు. తాజా మ్యాచ్‌లో డైమండ్ డక్‌గా వెనుదిరిగి.. తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో పూరన్ 2, 22, 2, 0, 0, 9, 0‌లతో దారుణంగా విఫలమయ్యాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(4) భువీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గేల్‌తో మయాంక్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ వికెట్ నష్టానికి 32 రన్స్ మాత్రమే చేసింది. ఆ మరుసటి ఓవర్‌లోనే మయాంక్ అగర్వాల్ క్యాచ్ ఔట్ వెనుదిరగ్గా.. ఆవెంటనే పూరన్, గేల్ ఔటయ్యారు. అనంతరం దీపక్ హుడా కూడా వెనుదిరగడంతో పంజాబ్ 63 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది.

Story first published: Wednesday, April 21, 2021, 16:46 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X