న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాఫ్ నాలెడ్జ్ ప్రమాదకరం.. రిపోర్టర్‌ నోరు మూయించిన పాకిస్థాన్ ఫస్ట్ మహిళా కామెంటేటర్!

Pakistan’s first woman commentator shuts down a reporter after being questioned for wearing heels on pitch

కరాచీ: దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో అద్బుతమైన విజయాలందించినా పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు దక్కే ఆదరణ, గుర్తింపు తక్కువే. ముఖ్యంగా క్రికెట్‌ను ఆరాధ్య దైవంగా భావించే భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఈ పరిస్థితులు మరి ఎక్కువ. ఇప్పటికీ మహిళా క్రికెటర్లను పురుష క్రికెటర్లతో పోల్చడం, వారి కన్నా తక్కువ అంచనా వేయడం జరుగుతూనే ఉంది.

మూడేళ్ల క్రితం భారత మహిళా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఓ రిపోర్టర్.. పురుషుల క్రికెట్‌లో మీ ఫేవరేట్ ఎవరని అడిగాడు. ఈ ప్రశ్నకు చిర్రెత్తుకుపోయిన మిథాలీ.. ఇదే ప్రశ్నను వారిని అడుగుతారా? అని ఎదురు ప్రశ్నించింది. అలాగే పురుషుల క్రికెట్‌‌కు లభిస్తున్న ఆదరణ, పబ్లిసిటీ మహిళా క్రికెటర్లకు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా పాకిస్థాన్‌లో మళ్లీ ఇలాంటి ఘటనే ఆ దేశ మహిళా క్రికెటర్‌కు ఎదురైంది. పాకిస్థాన్ తొలి మహిళా కామెంటేటర్, మాజీ క్రికెటర్ మెరీనా ఇక్బాల్‌ను అవహేళన చేస్తూ ఓ రిపోర్టర్ ట్విటర్ వేదికగా అడిగిన ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో బదులిచ్చి నోరు మూయించింది.

ఖాదిర్ ఖవాజా అనే రిపోర్టర్.. పాకిస్థాన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో కామెంటేటర్‌గా వ్యవహరించిన మెరీనా హీల్స్ ధరించి ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సదరు జర్నలిస్ట్ 'హీల్స్ ధరించి పిచ్ మొత్తం తిరగడం సబబేనా? జస్ట్ అభిప్రాయం కోసమే అడుగుతున్నా'అని ట్వీట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌కు మెరీనా దిమ్మతిరిగే రిప్లే ఇచ్చింది. 'సగం నాలెడ్జ్ ప్రమాదకరం ఖాదీర్. పిచ్‌పై ఫ్లాట్ షూస్‌తో నడిచా. ప్రీ మ్యాచ్‌లో హైహీల్స్ ధరించా. నేను పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను. నాకు ప్రొటోకాల్స్ తెలుసు'అని ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ సదరు జర్నలిస్ట్ నోరు మూయించింది. ఈ సమాధానంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భలే సమాధానం ఇచ్చావు మెరీనా అంటూ ప్రశంసిస్తున్నారు. పాకిస్థాన్ తరఫున ఆరేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన మెరీనా.. 2009లో అరంగేట్రం చేసి 36 వన్డేలు, 42 టీ20లు ఆడింది. వన్డేల్లో 436, టీ20ల్లో 340 రన్స్ చేసింది. 2017లో న్యూజిలాండ్‌తో చివరిసారిగా వన్డే ఆడిన మెరీనా.. అనంతరం పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య మలేషియా వేదికగా జరిగిన సిరీస్‌లో కామెంటేటర్‌గా అవతారమెత్తింది.

Story first published: Monday, October 5, 2020, 15:33 [IST]
Other articles published on Oct 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X