ఐపీఎల్‌లో ఆడాలని లేదు, పిలిచి అడిగినా ఆడను: షాహిద్ అఫ్రీది

Posted By:
Pakistan Super League Will Be Bigger Than Indian Premier League Very Soon, Says Shahid Afridi

హైదరాబాద్: 'పిలిచి ఆడమని అడిగినా ఐపీఎల్‌లో ఆడను.' ఈ మాటలు అంటోంది మరెవరో కాదు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది. రెండు రోజుల క్రితం కశ్మీర్‌పై సంచలనమైన ట్వీట్ చేసి వివాదం రేపిన అఫ్రీది మరోసారి మీడియా ముందు పరుష వ్యాఖ్యలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని సంబంధిత మీడియా ప్రతినిధి తన అధికారిక ట్వీట్ ద్వారా బయటపెట్టాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఆడమని అడిగినా ఆడను:

ఆడమని అడిగినా ఆడను:

‘వారు ఒక వేళ ఐపీఎల్‌లో ఆడామంటూ పిలిచినా.. నేను వెళ్లను. మా పీఎస్‌ఎల్‌ భవిష్యత్తులో ఐపీఎల్‌ కన్నా పెద్ద లీగ్‌గా అవతరిస్తోంది. నేను ప్రస్తుతం పీఎస్‌ఎల్‌ను ఆస్వాదిస్తున్నాను. నాకు ఐపీఎల్‌ ఆడాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఐపీఎల్‌ అంటేనే ఆస్తక్తి లేదు. పీఎస్ఎల్ త్వరలోనే ఐపీఎల్ కంటే పెద్ద స్థాయిలో అవతరించనుంది.

ఇది ఇప్పుడు..మరి అప్పుడు:

ఇది ఇప్పుడు..మరి అప్పుడు:

గతంలో అఫ్రిది ఇదే ఐపీఎల్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు. ‘నేనొక్కసారే ఐపీఎల్‌లో ఆడా. కానీ ఇది ఓ గొప్ప టోర్నీ.. ఈ లీగ్‌లో ఆడటంతో ప్రత్యేక అనూభూతి కలిగింది.' అని ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక అఫ్రిది ఐపీఎల్‌ తొలి సీజన్‌లో అప్పటి డెక్కన్‌ చార్జర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

భారత అధికారుల నిర్లక్ష్యమే కారణం:

భారత అధికారుల నిర్లక్ష్యమే కారణం:

'కశ్మీర్‌ ప్రాంతంపై భారత అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. తత్ఫలితంగా కశ్మీర్ ప్రజలు తీవ్ర అవస్థలకు గురౌతున్నారు' అంటూ ట్వీట్ చేశాడు అఫ్రీది. దీనికి స్పందించిన సచిన్, గంభీర్, కోహ్లీ, రైనా, కపిల్‌దేవ్ తమదైన శైలిలో షాహిద్ అఫ్రీది తని పని తాను చూసుకుంటే మంచిదని చురకలంటించారు.

పాకిస్థాన్‌లో ఆడేందుకు విముఖత:

పాకిస్థాన్‌లో ఆడేందుకు విముఖత:

ఇక భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వివాదంతో ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్‌కు అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే. మరో పక్క పాక్‌లో భద్రతా లేమీ కారణంగా చాలా మంది క్రికెటర్లు పీఎస్ఎల్‌లో ఆడేందుకే భయపడుతున్నారు. కొన్ని సార్లు స్టేడియంలో చాలా భాగం వరకు ఖాళీగా ఉండటంతో ఆ ఫొటోలను ట్వీట్ చేస్తూ నెటిజన్లు పీఎస్ఎల్‌ను ఎండగడుతున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 11:51 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి