న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ ప్రమాదకరం: పీసీబీ ఛైర్మన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీసీసీఐ

Pakistan should look at security in their own country first: BCCI vice-president Mahim Verma

హైదరాబాద్: పాకిస్థాన్‌ కన్నా భారతే చాలా ప్రమాదకరమని పీసీబీ ఛైర్మన్ మణి చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ మహిమ్‌ వర్మ తిప్పికొట్టారు. అర్థం లేకుండా మాట్లాడొద్దని మణికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మహిమ్‌ వర్మ మాట్లాడుతూ "ముందు వారి సొంత దేశంలో భద్రత గురించి చూసుకోమనండి. దాని గురించి బాగా ఆలోచించమనండి. మా దేశం, మా భద్రతను చూసుకొనే సామర్థ్యం మాకుంది" అని అన్నాడు.

పీసీబీ ఛైర్మన్‌ ఇషాన్‌ మని సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భద్రతాపరంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌ కన్నా భారతే చాలా ప్రమాదకరంగా ఉందని అన్నాడు. సొంతగడపై దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్‌ విజయవంతం కావడంతో ఇషాన్‌ ఆనందం వ్యక్తం చేసాడు.

IPL Fantasy XI: గంగూలీ జట్టులో ధోనీకి దక్కని చోటు.. కెప్టెన్‌ ఎవరంటే!!IPL Fantasy XI: గంగూలీ జట్టులో ధోనీకి దక్కని చోటు.. కెప్టెన్‌ ఎవరంటే!!

"శ్రీలంక జట్టు ఇక్కడ పర్యటించిన తర్వాత భద్రత విషయంపై ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. శ్రీలంక టెస్టు సిరీస్‌తో పాక్‌లో క్రికెట్‌ పునర్వైభవం సంతరించుకుంటదనే నమ్మకం ఉంది. శ్రీలంక మాదిరి మిగతా దేశాలు కూడా పాక్‌లో క్రికెట్‌ ఆడటానికి రావాలి. సానుకూల వాతావరణం నెలకొందని ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి పాక్‌ మీడియా, అభిమానులు ఎంతో సహకరించారు" అని ఇషాన్‌ తెలిపాడు.

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున: వన్డేల్లో తొలి సెంచరీని రుచి చూసిన విరాట్ కోహ్లీసరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున: వన్డేల్లో తొలి సెంచరీని రుచి చూసిన విరాట్ కోహ్లీ

"జనవరిలో బంగ్లాదేశ్‌ ఇక్కడ పర్యటించడానికి ఆ దేశ బోర్డుతో చర్చలు జరుపుతున్నాం. అలాగే ఇతర జట్లతో సైతం సంప్రదింపులు జరుపుతాం. ఇక నుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడం. ఎవరైనా మాతో సిరీస్‌ ఆడాలనుకుంటే ఇక్కడకు రావాల్సిందే. బంగ్లా తప్పకుండా పర్యటిస్తుందనే నమ్మకముంది. బంగ్లా బోర్డు తిరస్కరించడానికి ఇప్పుడు ఎలాంటి కారణాలు లేవు. శ్రీలంక పర్యటించాక మిగతా జట్లు ఎందుకు రావు" అని మణి అన్నాడు.

Story first published: Tuesday, December 24, 2019, 17:58 [IST]
Other articles published on Dec 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X