పాకిస్థాన్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైన వెస్టిండీస్

Posted By:
Pakistan complete T20 series whitewash over West Indies

హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండు టీ20లను గెలిచిన పాకిస్థాన్ మూడో టీ20 మ్యాచ్ అయినా వదులుకుంటుందోమోన్న ఆశతో వెస్టిండీస్ కనిపించింది. మొదటి నుంచి చివరి వరకు ఒకే పట్టుదలను ప్రదర్శించిన పాకిస్థాన్ జట్టు అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి సిరీస్‌ను గెలుచుకుంది.

పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఫఖర్‌ జామన్‌కు 'ప్లెయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', బాబర్‌ అజామ్‌కు 'ప్లెయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు లభించాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేపట్టిన విండీస్‌.. 43బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లతో కలిపి ప్లెచర్‌ (52), 25బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో కలిపి శ్యాముల్స్‌‌(31) రాణించారు. చివర్లో 18బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లతో కలిపి రామ్‌దిన్‌ (42) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగుల చేసింది.

పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీయగా నవాజ్‌, ఉస్మాన్‌ ఖాన్‌, అష్రాష్‌ తలో వికెట్‌ తీశారు. బ్యాటింగ్‌‌తో చేపట్టిన పాక్‌ 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. పాక్‌ ఓపెనర్లు ‌17బంతుల్లో ఫఖర్‌ జామన్ 6ఫోర్లు, 2సిక్సర్లతో కలిపి (40), 40బంతుల్లో బాబర్‌ అజామ్‌ 6ఫోర్లతో కలిపి (51) శుభారంభాన్ని అందించారు.

మిగిలిన బ్యాట్స్‌మెన్ 28బంతుల్లో హుస్సేన్‌(31) , 16బంతుల్లో ఆసిఫ్‌ ‌(25) రాణించారు. స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు లేక నిరాశ చెందిన పాక్‌ అభిమానులకు ఈ సిరీస్‌తో భవిష్యత్తు సిరీస్‌లపై ఆశలు చిగురించాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 4, 2018, 12:29 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి