న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే మరెవరికీ సాధ్యం కానీ ఆ అద్భుతానికి 16 ఏళ్లు..!!

On this day Brian Lara becomes first to score 400 in a Test innings

సెయింట్ జాన్స్​: సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు (2004, ఏప్రిల్ 12) టెస్టు క్రికెట్ చరిత్రలో అద్భుతం చోటు చేసుకుంది. అప్పటి వరకు కనీ వినీ ఎరుగని.. కనీసం ఊహాకు కూడా అందని రికార్డు నమోదైంది. ఆ ఆసాధారణ రికార్డును వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా తన పేరిట లిఖించుకున్నాడు. దశాబ్దన్నర కాలమైనా ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పటి వరకూ ఏ ఆటగాడు కూడా కనీసం ఆ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేదు.

ఆ రికార్డు ఏంటంటే..?

సంప్రదాయం ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అది కూడా 400 పరుగులు. అసాధ్యమైన ఈ రికార్డు విండీస్ వీరుడు బ్రియాన్ లారా సుసాధ్యం చేశాడు. సెయింట్ జాన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో లారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లారా భారీ ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 751/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకే ఆలౌటై.. ఫాలో ఆన్ ఆడినా ఓటమి నుంచి గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 422/5 రాణించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

హెడెన్ రికార్డు బద్దలు..

హెడెన్ రికార్డు బద్దలు..

అసాధారణమైన 400 పరుగుల బ్రియాన్ లారా రికార్డుతో యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్యానికి లోనైంది. అంతేకాకుండా సంప్రదాయక ఫార్మాట్‌లో అప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హెడెన్(380) పేరిట ఉన్న వ్యక్తిగత అత్యధిక స్కోర్ రికార్డు బద్దలైంది. 2003లో జింబాబ్వేపై హెడెన్ ఈ ఘనతను అందుకున్నాడు. అయితే ఈ రికార్డు నమోదైన 6 నెలకే లారా అధిగమించడం విశేషం. ఇక 1994లోనే ఇదే ఇంగ్లండ్‌పై లారా 375 పరుగులు చేశాడు.

‘విజ్డెన్‌'లో రోహిత్‌కు చోటు లేదా?.. యాషెస్ కంటే ప్రపంచకప్ పెద్దది..

మూడు లైఫ్‌లు..

మూడు లైఫ్‌లు..

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో లారా దారుణంగా విఫలమయ్యాడు. తొలి మూడు టెస్ట్‌ల్లో కేవలం 100 పరుగులే చేశాడు. అందులో 36 పరుగులే అత్యధికం. ఇక నాలుగో టెస్ట్ తొలి రోజు 86 పరుగులు చేసిన ఈ విండీస్ వీరుడు.. రెండో రోజు ఆట ముగిసే సరికి 313 పరుగులతో నిలిచాడు. మూడో రోజు 400 పరుగులు పూర్తవ్వగానే డిక్లేర్ ఇచ్చారు. అయితే లారా ఆదిలో కీపర్ క్యాచ్, 127 పరుగుల వద్ద రనౌట్, 373 పరుగుల వద్ద మరోసారి కీపర్ క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఒకవైపు ప్రశంసలు.. మరో వైపు విమర్శలు..

ఒకవైపు ప్రశంసలు.. మరో వైపు విమర్శలు..

లారా వ్యక్తిగత రికార్డు కోసం తొలి ఇన్నింగ్స్​ను మూడు రోజుల పాటు కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. లారా విజయం కోసం కాకుండా రికార్డుల కోసం ఆరాటపడ్డాడనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక తమ సొంతగడ్డపై జరిగిన ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో విండీస్ 0-3తో ఇంగ్లండ్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైంది. చివరి టెస్ట్ లారా ఇన్నింగ్స్‌తో డ్రాగా ముగిసింది.

Story first published: Sunday, April 12, 2020, 14:09 [IST]
Other articles published on Apr 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X