For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘విజ్డెన్‌’లో రోహిత్‌కు చోటు లేదా?.. యాషెస్ కంటే ప్రపంచకప్ పెద్దది..

VVS Laxman shocked to see Rohit Sharmas name missing from Wisden list

ముంబై: ప్రతిష్ఠాత్మక విజ్డెన్‌ జాబితాలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు చోటు దక్కకపోవడంపై మాజీబ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్‌ క్రికెటర్లలో పురుషుల విభాగం నుంచి ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, మహిళల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్‌ పెర్రీని ఎంపికచేస్తూ మూడ్రోజుల క్రితం విజ్డెన్‌ అల్మానక్‌ ఎడిషన్‌ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇది ఆశ్చర్యం..

ఇది ఆశ్చర్యం..

‘వరల్డ్‌కప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు చేసిన రోహిత్‌ పేరును విజ్డన్ జాబితాలో లేకపోవడం ఏంటో తనకు అర్థం కాలేదని లక్ష్మణ్‌ తెలిపాడు. ‘యాషెస్ సిరీస్ ముఖ్యమైందే కావొచ్చు. కానీ ప్రపంచకప్ దాని కంటే పెద్దది. అలాంటి టోర్నీలో రోహిత్ ఐదు సెంచరీలు బాదాడు. కఠినమైన సౌతాంప్టన్ పిచ్‌పై దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇతర ఆటగాళ్లు పరుగులు చేయడానికి కష్టపడితే.. అతను మాత్రం అద్భుతంగా ఆడి సెంచరీ చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఆటగాడిని పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. విజ్డెన్‌ జాబితాలో రోహిత్‌ పేరు లేకపోవడం క్రికెట్‌‌ను ఇష్టపడే ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. 'అని వీవీఎస్‌ అసహనం వ్యక్తం చేశాడు.

కోహ్లీకి బెన్ ‘స్ట్రోక్'

కోహ్లీకి బెన్ ‘స్ట్రోక్'

2016,2017,2018 వ‌రుస‌గా మూడేళ్ళు విజ్డ‌న్ రారాజుగా నిలిచిన విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ క్రికెట‌ర్ బెన్ స్టోక్స్ పెద్ద షాక్ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో తన జట్టును విశ్వవిజేతగా నిలిపిన ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ 2020 విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. దీంతో కోహ్లీ జైత్ర‌యాత్ర‌కి స్టోక్స్ బ్రేక్ వేసినట్లయింది.

2005లో ఇంగ్లండ్ తరఫున విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా మాజీ ప్లేయ‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఎంపిక కాగా, ఈ అరుదైన గౌర‌వాన్ని అందుకున్న తొలి ఇంగ్లీష్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఇప్పుడు బెన్ స్టోక్స్ త‌ర్వాతి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన వరల్డ్ కప్ ఫైనల్లో స్టోక్స్ 84(98 బంతుల్లో) పరుగులతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

జీవితాంతం గుర్తుండిపోయే..

జీవితాంతం గుర్తుండిపోయే..

ప్రపంచకప్ ఫైనల్, యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ జీవితాంతం గుర్తుండిపోయే అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాడని విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బూత్ తెలిపాడు.అత‌ను అసాధారణ ఆట ఆడాడ‌డ‌ని చెప్పుకొచ్చాడు. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ విజ్డన్ లీడింగ్ మహిళా క్రికెటర్‌గా నిలిచింది. విజ్డన్ అత్యత్తుమ ఐదుగురు ప్లేయర్ల జాబితాలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్, ఎల్లిస్ పెర్రీ, సిమన్ హర్మర్, మార్నస్ లబుషేన్ చోటు దక్కించుకున్నారు. విజ్డన్ టీ20 లీడింగ్ క్రికెటర్‌గా వెస్డిండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రూ రసెల్ ఎంపికయ్యాడు. హెడింగ్లీలోని బెన్ స్టోక్స్ ఫోజ్.. విజ్డన్ ఫొటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.

Story first published: Sunday, April 12, 2020, 9:46 [IST]
Other articles published on Apr 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+