ఏమాత్రం కలిసిరాలేదు: మరో వివాదంలో డేవిడ్ వార్నర్!

Posted By:
Now David Warner is apparently being accused of ball tampering

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన డేవిడ్ వార్నర్‌కు ఏ మాత్రం కలిసొచ్చినట్టులేదు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌తో జరిగిన వివాదం మరిచిపోకముందే వార్నర్‌ను మరో వివాదం చుట్టుముట్టింది.

Australia vs South Africa 2018 2nd Test Score Card

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా సఫారీలతో జరుగుతోన్న రెండో టెస్టులో రెండో రోజైన శనివారం వార్నర్‌ ఎడమ అరచేతికి పెద్ద బ్యాండేజీ వేసుకొని కనిపించాడు. ఆ బ్యాండేజీ ద్వారా వార్నర్‌ బాల్‌ టాంపరింగ్‌కు పా ల్పడుతున్నాడని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ అంపైర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఛానెల్ 9 సండే స్పోర్ట్స్ కార్యక్రమంలో ప్రస్తావించింది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ రేయాన్ హార్రిస్ కొట్టిపారేశారు. వార్నర్‌పై ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. వార్నర్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు.

తాను గతంలో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఆడిన సమయంలో అతడి చేతి వేళ్లకు బ్యాండేజి వేసుకోవడాన్ని చాలా సార్లు చూశానని తెలిపాడు.తొలి టెస్టు సందర్భంగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌తో గొడవ పెట్టుకొన్న వార్నర్‌కు మ్యాచ్‌ ఫీజులో 75శాతం జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పట్టు బిగించింది. మూడో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్‌ ఖవాజా (75) ఒక్కడే సఫారీ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్‌ (24), వార్నర్‌ (13)లతో పాటు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (11), షాన్‌ మార్ష్‌ (1) విఫలమయ్యారు.

ఐదో వికెట్‌కు మిచెల్ మార్ష్(39 నాటౌట్)తో కలిసి ఖవాజ 87 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మిచెల్ మార్ష్ (39), టిమ్ షైనీ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. 41 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆస్ట్రేలియా చేతిలో ఇంకా 5 వికెట్లు మాత్రమే మిగిలున్నాయి. సోమవారం ఆస్ట్రేలియాను త్వరగా ఔట్ చేయగలిగితే రెండో టెస్టులో విజయం సాధిస్తుంది.

Story first published: Monday, March 12, 2018, 13:23 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి