న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఒక్క ఓటమితో మా ప్రపంచమేమీ ఆగిపోదు'

‘Not end of world for us,’ Eoin Morgan backs England after shocking lost to Scotland

హైదరాబాద్: స్కాట్లాండ్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పొందింది. అయితే ఈ ఓటమి పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ తనదైన శైలిలో స్పందించాడు. ఆ ఓటమితో తమ క్రికెట్‌ జీవితమేమీ అంతంకాదని ఇంగ్లాండ్ జట్టుకు మద్దతుగా నిలిచాడు. అయితే స్కాట్లాండ్‌తో ఓటమి తాము అనేక విషయాలను నేర్చుకోవడానికి కచ్చితంగా దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

'అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. కాకపోతే స్కాట్లాండ్‌ బాగా ఆడింది. అంతేకాదు విజయం సాధించడానికి వారు అన్ని విధాలా అర్హులు. వారు ఉత్తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఈ ఓటమితో మాకు ప్రపంచం అంతం కాదు. మ్యాచ్‌ ఆద్యంతం పరుగుల వరద పారింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు మాకు మంచి ప్రాక్టీస్‌ అయితే లభించింది.'

'వన్డేల్లో మేము నంబర్‌ వన్‌ స్థానంలో ఉండటంతో మాపై భారీ అంచనాలు నెలకొన‍్నాయి. కానీ, అనుకున్నంత స్థాయిలో ఆడలేక.. అంచనాలను అందుకోలేకపోయాం. అయినా.. ఈ ఓ‍టమి మమ్మల్ని ఏమీ కృంగదీయడం లేదు. మ్యాచ్‌లో గెలుపు-ఓటములు సర్వ సాధారణం' అని ఇయాన్‌ మోర్గాన్‌ పేర‍్కొన్నాడు.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరదపారింది. మెక్‌లాయిడ్‌ (140 నాటౌట్‌), కోయిజ్జర్‌ (58), ముస్నే (55) చెలరేగడంతో మొదట స్కాట్లాండ్‌ 5 వికెట్లకు 371 పరుగులు సాధించింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ విజయానికి కొద్ది దూరంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ 48.5 ఓవర్లలో 365 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (105), ప్లంకెట్‌ (47 నాటౌట్‌), మొయిన్‌ అలీ (46) రాణించారు.

Story first published: Monday, June 11, 2018, 15:14 [IST]
Other articles published on Jun 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X