న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొండిచేయి: రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ముగిసినట్టేనా?

By Nageshwara Rao
Rohit Sharma Didn't Get Opportunity In Test Series Once Again
No Rohit or Saha, Bhuvneshwar injury concern: India name squad for the first three England Tests

హైదరాబాద్: రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ముగిసినట్టేనా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇంగ్లాండ్‌ గడ్డపై ఇటీవల రెండు మెరుపు సెంచరీలు చేసినప్పటికీ, రోహిత్ శర్మకి మరోసారి భారత సెలక్టర్లు మొండిచేయి చూపారు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తొలి మూడు టెస్ట్‌లకు సెలక్షన్‌ కమిటీ 18 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. అయితే, ఈ జట్టులో రోహిత్ శర్మకు సెలక్టర్లు చోటివ్వలేదు. జూన్ నెలలో అఫ్గానిస్థాన్‌తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మను సెలక్టర్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. వృద్ధిమాన్ సాహా గాయపడటంతో అతని స్థానంలో పంత్‌కు ఓ అవకాశం ఇచ్చారు. ఇక, దినేష్ కార్తీక్‌ను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. బొటన వేలి గాయంతో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరిస్‌కు దూరమైన బుమ్రాకు కూడా చోటు దక్కింది.

షమీకి సైతం చోటు

షమీకి సైతం చోటు

మూడో వన్డేలో గాయపడిన భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించలేదు. భువనేశ్వర్ కుమార్ వెన్ను గాయం మరింత ఎక్కువైందని, టెస్టు జట్టులోకి అతన్ని తీసుకోవాలా వద్ద అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని ఆ ప్రకటనలో బోర్డు చెప్పింది. ఇక యో-యో టెస్టులో పాసైన పేస్ బౌలర్ మహ్మద్ షమికి కూడా టెస్టు జట్టులో సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది.

ఇంగ్లాండ్‌ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్

ఇంగ్లాండ్‌ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్

కానీ, ఇంగ్లాండ్‌ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపించడంపై అతడి టెస్టు కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. మూడో టీ20లో కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత తొలి వన్డేలోనూ 114 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

రోహిత్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని సెలక్టర్లు

రోహిత్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని సెలక్టర్లు

అయినా సరే, టెస్టు జట్టు ఎంపికలో రోహిత్ శర్మ ప్రదర్శనని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తుంటాడు. అయితే, సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టుని పరిశీలిస్తే మిడిలార్డర్‌లో పుజారా, రహానె, కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్‌‌కి అవకాశం దక్కింది.

టెస్టు జట్టుకు తొలిసారి ఎంపికైన రిషబ్ పంత్‌

టెస్టు జట్టుకు తొలిసారి ఎంపికైన రిషబ్ పంత్‌

ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు తొలిసారి టెస్టు జట్టులో సెలక్టర్లు చోటు కల్పించగా.. మూడో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌కి కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. కాగా, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగ‌స్టు 1న ఎడ్‌బాస్ట‌న్‌ వేదికగా భారత్ తొలి టెస్టు ఆడనుంది.

ఇంగ్లాండ్‌తో తొలి మూడు టెస్టులకి భారత్ జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్

Story first published: Wednesday, July 18, 2018, 18:18 [IST]
Other articles published on Jul 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X