న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ తర్వాత బలమైన జట్టు బంగ్లాదేశ్ మాత్రమే

Nidahas Trophy: Bangladesh second-strongest after India, says Sanjay Manjrekar

హైదరాబాద్: భారత జట్టు తర్వాత బలమైన జట్టుగా బంగ్లాదేశ్‌ను అభివర్ణించారు సంజయ్ మంజ్రేకర్. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో తలపడనున్న జట్లు బంగ్లాదేశ్, భారత్‌, శ్రీలంక.

'పసికూన ముద్రని చెరిపేసుకుంటున్న బంగ్లాదేశ్‌కి ఈ ముక్కోణపు టీ20 టోర్నీ మంచి అవకాశం. ఆ జట్టు ఇప్పుడిప్పుడే బలమైన జట్టుగా ఎదుగుతోంది. ప్రస్తుత శ్రీలంక జట్టుతో పోలిస్తే బంగ్లా మెరుగ్గా ఆడుతోంది. ఆ జట్టులో షకీబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లాంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లున్నారు. కాబట్టి.. టోర్నీలో భారత్ తర్వాత బలమైన జట్టు బంగ్లాదేశ్ మాత్రమే' అని మంజ్రేకర్ వివరించారు.

కాగా, ఈ మూడింటిలో భారత్ తర్వాత బంగ్లాదేశ్‌యే టాప్ అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీలో ఆతిథ్య శ్రీలంకతో పాటు భారత్, బంగ్లాదేశ్ మాత్రమే పోటీపడనుండటంతో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న టీమిండియా శనివారం రాత్రి చివరి టీ20 మ్యాచ్‌తో సఫారీ పర్యటన ముగించి తిరుగు ప్రయాణం అవనుంది.

భారత జట్టు సఫారీ పర్యటన అనంతరం 9 రోజులు విశ్రాంతి తీసుకుని ఈ ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది. ఈ ముక్కోణపు టీ20 ముగిసిన తర్వాత.. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంకానుంది. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ అయిన మష్రఫె మోర్తజా ఈ టీ20కి అందుబాటులోకి రానున్నాడు. ఆయన రాకతో జట్టు గెలిచేందుకు అవకాశాలున్నాయంటూ మంజ్రేకర్ పేర్కొన్నారు.

Schedule:

* March 6 - Sri Lanka vs India
* March 8 - Bangladesh vs India
* March 10 - Sri Lanka vs Bangladesh
* March 12 - India vs Sri Lanka
* March 14 - India vs Bangladesh
* March 16 - Bangladesh vs Sri Lanka
* March 18 - Final

Story first published: Friday, February 23, 2018, 17:29 [IST]
Other articles published on Feb 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X