న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

15 బంతుల్లో 6 వికట్లు పడగొట్టిన కివీస్ బౌలర్(వీడియో)

 New Zealand vs Sri Lanka: Trent Boult Takes 6 Wickets In 15 Balls To Crush Sri Lanka

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో బౌలర్లు శాసిస్తున్నారు. తొలిరోజు ఆటను పూర్తిగా బౌలర్లే ఆధిక్యం ప్రదర్శించడంతో ఏకంగా 14 వికెట్లు నేలరాలాయి. మొదట సురంగ లక్మల్‌ (5/54) కివీస్‌ ఆలౌట్‌కు నాంది పలికితే... ఆ తర్వాత టిమ్‌ సౌతీ (3/29) లంక టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. బుధవారం ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌లో టిమ్‌ సౌతీ పట్టుదలగా రాణించడంతో (68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆ మాత్రం స్కోరు సాధ్యపడింది.

లహిరు కుమార 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక తొలిరోజు ఆట నిలిచే సమయానికి 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో నిలబడిన సౌతీ తన బౌలింగ్‌తో లంకను ఓపెనర్లు గుణతిలక (8), కరుణరత్నే (7), కెప్టెన్‌ చండిమల్‌ (6)లను 21 పరుగులకే పెవిలియన్‌ చేర్చాడు. న్యూజిలాండ్ మరో ఫాస్ట్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ లంకను కంగుతినిపించాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో అత‌ను అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

15 బంతుల్లోనే ఆరు వికెట్లు:
కేవ‌లం 15 బంతుల్లోనే ఆరు వికెట్లు తీసి లంక‌ను క‌ష్టాల్లో నెట్టేశాడు. రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక‌కు ట్రెంట్ భారీ షాక్ ఇచ్చారు. నాలుగు వికెట్ల‌కు 88 ప‌రుగుల వ‌ద్ద బ్యాటింగ్ మొద‌లుపెట్టిన శ్రీలంక‌.. కేవ‌లం 104 ప‌రుగుల‌కే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఒక‌వైపు నాన్‌స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో మాథ్యూస్ ఉండ‌గా.. మ‌రో వైపు చివ‌రి న‌లుగురు లంక ప్లేయ‌ర్లు డ‌కౌట్ అయ్యారు.

రెండో ఇన్నింగ్స్ ఆడుతోన్న న్యూజిలాండ్ ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఇప్పటి వరకూ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన జీత్ రావ్ 74పరుగులకు అవుట్ అవగా.. మరో బ్యాట్స్‌మన్ 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతనితో పాటుగా 25పరుగులతో రోస్ టేలర్ ఉన్నారు.

Story first published: Thursday, December 27, 2018, 13:40 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X