న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంగ్రాట్స్ మయాంక్.. కొడుకా? బిడ్డా? న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సెటైర్స్!

New Zealand star Jimmy Neesham brutally trolls Mayank Agarwal after the latter posts picture of workout

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సోషల్ మీడియాలో తనదైన పోస్టులతో అభిమానులను అలరించే జిమ్మీ తాజాగా మయాంక్ పోస్ట్‌పై సరదాగా చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు జిమ్‌లో తెగ కష్టపడుతున్న మయాంక్ అగర్వాల్.. జిమ్ సెషన్‌కు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా పంచుకున్నాడు. దీనికి 'ప్రతీ రోజు కష్టపడితేనే మనం కావాలనుకున్న మార్పు లభిస్తుంది'అని క్యాప్షన్‌గా పేర్కొంటూ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫొటోను పంచుకున్నాడు.

అయితే ఈ ఫొటోలో బరువెత్తే క్రమంలో మయాంక్ అగర్వాల్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ప్రసవ సమయంలోని గర్భిణిలా ఉంది. దాంతో అతని ముఖ కవలికలపై జిమ్మీ నీషమ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'కంగ్రాట్స్ మయాంక్.. కొడుకా? బిడ్డా?'అని సెటైరిక్‌గా ప్రశ్నించాడు. ఇక ఈ కామెంట్‌కు స్పందించిన మయాంక్.. 'నీ ప్రశ్నకు సమాధానం టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ నిక్ వెబ్ ఫేస్'అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

New Zealand star Jimmy Neesham brutally trolls Mayank Agarwal after the latter posts picture of workout

గత ఐపీఎల్ సీజన్‌లో మయాంక్, జిమ్మీ నీషమ్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే తన మాజీ సహచర ఆటగాడిపై జిమ్మీ నీషమ్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక అప్‌కమింగ్ సీజన్‌లో మయాంక్ పంజాబ్ కింగ్స్‌కే ఆడుతుండగా.. జిమ్మీ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. వేలానికి ముందే నీషమ్‌ను డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది.

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన మయాంక్ అగర్వాల్ తుది జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నాడు. ఆసీస్ టూర్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశాలు అందుకున్న మయాంక్.. 17, 9, 0, 5 దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనిపై వేటు వేసింది. సిడ్నీ టెస్ట్‌లో అవకాశం ఇవ్వకుండా బెంచ్‌కే పరిమితం చేసింది. ఇక ఆఖరి మ్యాచ్‌లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అవకాశం ఇచ్చినా.. అతను 39, 9తో మరోసారి విఫలమయ్యాడు. దాంతో తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో కూడా ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో అవకాశం అందుకున్న శుభ్‌మన్ గిల్, మరో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణిస్తుండటంతో మయాంక్ అవకాశం కోసం నిరీక్షించక తప్పడం లేదు.

Story first published: Monday, March 1, 2021, 18:24 [IST]
Other articles published on Mar 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X