న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs AFG T20 WC:చేతులెత్తేసిన అఫ్గాన్! భారత్ ఇంటికి.. సెమీస్‌కు న్యూజిలాండ్!

New Zealand reach semifinals, Afghanistan and India knocked out

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్ అధికారికంగా నిష్క్రమించింది. కోహ్లీసేన సాధించిన రెండు భారీ విజయాలతో రేకెత్తిన ఆశలపై న్యూజిలాండ్ నీళ్లు జల్లింది. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సమష్టిగా చెలరేగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సగర్వంగా విలియమ్సన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.

నజీబుల్లా జడ్రాన్(48 బంతుల్ల 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) మినహా అంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/24), ట్రెంట్ బౌల్ట్(3/17) అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మరోసారి కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 3 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డేవాన్ కాన్వే(32 బంతుల్లో 4 ఫోర్లతో 36), మార్టిన్ గప్టిల్(23 బంతుల్లో 4 ఫోర్లతో 28) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

125 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో న్యూజిలాండ్ మొదటి నుంచే సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, మిచెల్ (17) జట్టుకి మెరుగైన ఆరంభం ఇవ్వగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ ,డేవాన్ కాన్వె సమయోచితంగా ఆడారు. ఓపెనర్లను స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్‌ పెవిలియన్ చేర్చినా నిదానంగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. తమ అనుభవంతో అఫ్గాన్ స్పిన్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మూడో వికెట్‌కి అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సునాయస విజయాన్నందించారు.

అంతకుముందు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అఫ్గానిస్థాన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మిల్నే, ట్రెంట్ బౌల్ట్ తమ వరుస ఓవర్లలో ఓపెనర్లు మహమ్మద్ షెహ్‌జాద్(4), హజ్రతుల్లా జాజై‌లను ఔట్ చేశారు. ఆ కొద్ది సేపటికే క్రీజులోకి వచ్చిన రెహ్మానుల్లా గుర్బాజ్(6)ను కూడా సౌతీ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో అఫ్గాన్ మూడు వికెట్ల నష్టానికి 23 పరుగులు మాత్రమే చేసింది. దాంతో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ రక్షణాత్మకంగా ఆడే ప్రయత్నం చేశారు. గుల్బాదిన్ నైబ్(15), నజీబుల్లా జడ్రాన్(73) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే ఈ జోడీని ఇష్ సోదీ విడదీశాడు. గుల్బాదిన్ నైబ్‌ను క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ మహమ్మద్ నబీ(14)తో కలిసి జడ్రాన్ ధాటిగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో మహమ్మద్ నబీ, జడ్రాన్ ఔటవ్వడం.. మరోవైపు సిక్సర్లను సైతం న్యూజిలాండ్ ఫీల్డర్స్ అడ్డుకోవడంతో అఫ్గాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసినా.. విలియమ్సన్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది.

Story first published: Sunday, November 7, 2021, 19:55 [IST]
Other articles published on Nov 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X