న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ అమ్మబడును.. వివరాలకు స్మిత్, జో బర్న్స్ సంప్రదించండి!

New Zealand fan brutally trolls Steve Smith and Joe Burns over their struggles against India

క్రైస్ట్‌ చర్చ్‌: క్యాప్షన్ చూసి ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, జో బర్న్స్ క్రికెట్ బ్యాట్స్ కంపెనీ పెట్టారా? అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అవును భారత్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో స్మిత్, జో బర్న్స్ దారుణంగా విఫలమవ్వడంపై ఓ న్యూజిలాండ్ అభిమాని సంధించిన వ్యంగ్యస్త్రాం ఇది. అది కూడా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా సదరు అభిమాని ప్లకార్డుతో వినూత్న రీతిలో విమర్శలు గుప్పించాడు.

ఉపయోగం లేని బ్యాట్లు..

‘పెద్దగా ఉపయోగంలో లేని క్రికెట్‌ బ్యాట్లు అమ్మబడును. వివరాలకు స్మిత్‌, బర్న్స్‌ను సంప్రదించగలరు'అనే ప్లకార్డు ప్రదర్శించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన రెండు టెస్టుల్లోనూ స్మిత్‌, బర్న్స్‌ దారుణంగా విఫలమయ్యారు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసిన బర్న్స్‌, రెండో టెస్టులో తేలిపోయాడు. కేవలం 0,4 పరుగులే చేశాడు. ఇక టెస్టుల్లో ఆసీస్‌కు కీలక ఆటగాడైన స్మిత్‌ తాజా సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలం..

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలం..

రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 1,1*,8,0 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు సార్లు అశ్విన్ ఉచ్చుకు చిక్కడం గమానార్హం. మరోవైపు పేవల ప్రదర్శన కారణంగా బర్న్స్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు ఇప్పటికే పక్కన పెట్టేసింది. అసలే ఫామ్‌ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్‌ అభిమాని సెటైర్ పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. ఇక భారత్‌తో వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో దూకుడు కనబర్చిన స్మిత్.. ఆ తర్వాత లయ తప్పాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌ను ఆడాలంటే వణికిపోతున్నాడు.

విలియమ్సన్ సెంచరీ..

విలియమ్సన్ సెంచరీ..

తండ్రైన ఉత్సాహంలో ఉన్న కేన్ విలియమ్సన్ వరుస సెంచరీలతో చెలరేగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనే సెంచరీతో రాణించిన కేన్(129).. తాజా రెండో టెస్ట్‌లోను మరో శతకం బాదాడు. విలియమ్సన్(112 బ్యాటింగ్) సెంచరీతో న్యూజిలాండ్ రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు కుప్పకూలింది. అజార్ అలీ(93), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(61) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 286 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(112 బ్యాటింగ్), హెన్రీ నికోలస్(89 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Monday, January 4, 2021, 16:13 [IST]
Other articles published on Jan 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X