న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌పై న్యూజిలాండ్ అద్భుత విజయం.. మారిన పాయింట్స్ టేబుల్

New Zealand End Pakistan Defiance For Thrilling Win In 1st Test

మౌంట్‌మాంగ్‌నోయ్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్నందుకుంది. 101 పరుగుల భారీ తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఆతిథ్య కివీస్ 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే పరిమితమైంది. ఫవాద్ అలామ్(102), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(60) పోరాడినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, నీల్ వాగ్నర్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్ విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

31 రన్స్ 5 వికెట్లు..

31 రన్స్ 5 వికెట్లు..

71/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్ మ్యాచ్ డ్రా కోసం అద్భుతంగా పోరాడింది. అజార్ అలీ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా ఫవాద్ అలామ్, మహ్మద్ రిజ్వాన్ ఐదో వికెట్‌కు165 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరి నిలకడైన ఆటతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగుస్తుందని అంతా భావించారు. కానీ కైల్ జేమీసన్ రిజ్వాన్, వాగ్నర్ ఫవాద్ అలామ్‌ను ఔట్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. చివరి 5 వికెట్లు కేవలం 31 పరుగుల తేడాలోనే కోల్పోయింది.

భారత్‌ను వెనక్కు నెట్టిన కివీస్..

ఈ విజయంతో న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కు నెట్టింది. పాయింట్ల ప్రకారం భారత్(390) అగ్రస్థానంలోనే ఉన్నా.. విజయాల శాతం ప్రకారం మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాపై రెండో టెస్ట్ విజయంతో మరో 30 పాయింట్లను ఖాతాలో వేసుకున్న భారత్ మొత్తం 390 పాయింట్లు సాధించింది. కానీ భారత్‌ విజయాల శాతం 72.2 ఉండగా ఆసీస్‌ 76.6 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజా విజయంతో న్యూజిలాండ్ 75 శాతం భారత్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచింది. కివీస్ ఖాతాలో 360 పాయింట్లు ఉన్నాయి.

సిరీస్ గెలిస్తే..

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రకారం ప్రతి టెస్టు సిరీసుకు 120 పాయింట్లు లభిస్తాయి. మ్యాచులను బట్టి వాటిని విభజిస్తారు. ఉదాహరణకు నాలుగు టెస్టులుంటే మ్యాచుకు 30 పాయింట్లు లభిస్తాయి. గెలిస్తే మొత్తం, డ్రా చేసుకుంటే సగం లభిస్తాయి. మొన్నటి వరకు పాయింట్ల పరంగానే జట్ల స్థానాలను లెక్కించిన ఐసీసీ హఠాత్తుగా విజయాల శాతం ప్రవేశపెట్టింది. దాంతో గెలుపు శాతం అధికంగా ఉన్న ఆసీస్‌ అగ్రస్థానంలోకి చేరగా భారత్‌ మూడో స్థానంలోకి వచ్చింది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంటే టీమ్ఇండియా మళ్లీ నంబర్‌ వన్‌ అయ్యే అవకాశముంది.

తాజా ఫలితాలతో..

తాజా ఫలితాలతో..

మెల్‌బోర్న్‌ టెస్టుకు ముందు ఆసీస్‌ విజయాల శాతం 0.835గా ఉండగా ఇప్పుడు 0.766కు తగ్గింది. మొత్తంగా 12 మ్యాచుల్లో 8 విజయాలు, 1 డ్రా, 3 ఓటములతో కంగారూలు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 11 మ్యాచుల్లో 8 విజయాలు, 3 ఓటములతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 10 మ్యాచులాడి 6 గెలిచి, 4 ఓడిన న్యూజిలాండ్‌ 75 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక 15 టెస్టులాడి 8 గెలిచి 3 డ్రా చేసుకొని, 4 ఓడిన ఇంగ్లండ్‌ 60.8 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. పాక్‌ (39.5), దక్షిణాఫ్రికా (28), శ్రీలంక (26), వెస్టిండీస్‌ (11.1), బంగ్లాదేశ్‌ (0.000) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Wednesday, December 30, 2020, 12:59 [IST]
Other articles published on Dec 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X