న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్విట్టర్ స్టార్ 'జేమ్స్‌ నీషమ్‌' అభిమాన భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

New Zealand Cricketer Jimmy Neesham Reveals His Favourite Indian Cricketer

వెల్లింగ్టన్‌: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే క్రికెట్ ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఇందులో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కూడా ఉన్నారు. టీమిండియా మాజీ ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంబీర్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఈ జాబితాలో న్యూజీలాండ్ ఆటగాడు జేమ్స్‌ నీషమ్‌ ఉన్నాడు. అయితే జిమ్మీ ఎక్కువగా కాంట్రవర్సల్ పోస్టులతో 'ట్విట్టర్ స్టార్' అయ్యాడు.

రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కోటక్‌, మాంబ్రేలకు బాధ్యతలురాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కోటక్‌, మాంబ్రేలకు బాధ్యతలు

 సోథినే నా ఫేవరెట్‌:

సోథినే నా ఫేవరెట్‌:

తాజాగా ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు నీషమ్‌ ఫన్నీ సమాధానం ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌​ ఖాతాలో నీషమ్‌ 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌' అనే లైవ్ నిర్వహించాడు. దీనిలో భాగంగా మీ ఫేవరెట్‌ భారత క్రికెటర్‌ ఎవరు అనే ప్రశ్న అతనికి ఎదురైంది. దీనికి నీషమ్‌ సమాధానమిస్తూ.. భారత్‌ సంతతికి చెందిన కివీస్ స్పిన్నర్ ఇష్‌ సోథీ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని తెలిపాడు. భారత మూలాలున్న సోథీ న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫన్నీ సమాధానంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుపై తన అభిమానాన్ని చూపెట్టాడు. అయితే ఈ సమాధానంతో సదరు ఫ్యాన్ అవాక్కయ్యాడు.

మురళీధరన్‌ అరుదైన టెస్టు రికార్డును అశ్విన్‌ను బద్దలు కొట్టేనా!!

పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు:

పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు:

ఫైనల్ మ్యాచ్ అనంతరం జేమ్స్‌ నీషమ్ ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 'పిల్లలూ ఎవ్వరూ క్రీడల్లోకి రావొద్దు. మీరు వేరే ఎదైనా ప్రొఫెషన్ ఎంచుకోండి. 60 ఏళ్లకే హ్యాపీగా చనిపోండి' అంటూ నీషమ్ పోస్ట్‌ చేశాడు. ఫైనల్ మ్యాచ్ ముందు.. 'ప్రియమైన భారత అభిమానులారా. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే.. దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయించండి' అని ట్వీట్ చేసాడు.

కోహ్లీ అభిమానులకు ఆగ్రహం:

కోహ్లీ అభిమానులకు ఆగ్రహం:

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్ 125 పరుగులు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. తొలి యాషెస్‌ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కంటే బర్న్స్‌ ఎక్కువ పరుగులు చేశాడని చమత్కరించాడు. ఇది కోహ్లీ అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్‌ స్టోక్స్‌ను ప్రశంసించాడు. స్టోక్స్‌ న్యూజిలాండ్‌ దేశస్తుడనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆకాశానికెత్తాడు. మొత్తంగా కాంట్రవర్సల్ పోస్టులతో జిమ్మీ నీషమ్ ట్విట్టర్ స్టార్ అయ్యాడు.

Story first published: Thursday, August 29, 2019, 14:54 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X