మురళీధరన్ అరుదైన టెస్టు రికార్డును అశ్విన్‌ను బద్దలు కొట్టేనా!!

జమైకా: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆంటిగ్వాలో జరిగిన మొదటి టెస్టును 319 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. శుక్రవారం నుంచి జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు ఆతిధ్య విండీస్ ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

అశ్విన్‌కు చోటు?:
తొలి టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు. అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. జడేజా రాణించినా.. విండీస్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న అశ్విన్‌కు చోటివ్వకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని భారత మాజీలు ప్రశ్నించారు. దీంతో రెండో టెస్టులో అశ్విన్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

8 వికెట్లు తీస్తే..:
ఈ క్రమంలోనే అశ్విన్‌ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 350 వికెట్లను చేరుకునేందుకు అశ్విన్ కేవలం 8 వికెట్ల దూరంలో నిలిచాడు. రెండో టెస్టులో చోటు దక్కించుకుని 8 వికెట్లు తీస్తే.. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డును అశ్విన్ సమం చేస్తాడు. మురళీ 66 మ్యాచ్‌ల్లో 350 వికెట్లు తీసాడు. ప్రస్తుతం అశ్విన్ 65 టెస్టు మ్యాచ్‌లు ఆడి 342 వికెట్లను పడగొట్టాడు. మరి మురళీ అరుదైన టెస్టు రికార్డును అశ్విన్‌ను బద్దలు కొడతాడేమో చూడాలి.

వెస్టిండీస్‌పై ఘనమైన రికార్డే:
మూడేళ్ల క్రితం వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటించినప్పుడు అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు గెలుచుకున్నాడు. ఆ టెస్టు సిరీస్‌లో అశ్విన్ 17 వికెట్లు సాధించి విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. మొత్తంగా విండీస్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 60 వికెట్లు తీసాడు. ఇందులో ఐదు వికెట్లను నాలుగు సందర్భాల్లో సాధించాడు. అంతేకాకుండా 552 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన జడేజా తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో అర్ధ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తాడో చూడాలి.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోటక్, మాంబ్రేలకు బాధ్యతలు

జట్టు (అంచనా):
మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చెటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా/రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications