న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ఆడతానని అనుకోలేదు: ఎంగిడి

Never expected I would be picked up in the auction: Ngidi

హైదరాబాద్: వివాదాల అనంతరం నిషేదానికి గురై మళ్లీ దక్షిణాఫ్రికా టెస్టులోకి పునరాగమనం చేశాడు ఎంగిడి. ఐపీఎల్‌ వేలంలో అతడిని చెన్నై కొనుగోలు చేసింది. అతనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఐపీఎల్ 11వ సీజన్‌లో ఆడలేనంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు విరామం అనంతరం జట్టులోకి అడుగుపెట్టాడు. 2018 సీజన్‌‌లో సంచలన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి వెలుగులోకి వచ్చాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఎంగిడి.. 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 153 పరుగులకే పంజాబ్‌ ఆలౌటవగా.. లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే చెన్నై ఛేదించేసింది. ఈ ఏడాది జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో తాను అమ్ముడుపోతానని అస్సలు ఊహించలేదని ఈ దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ వెల్లడించాడు.

'పుణె పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకి బాగా సహకరించింది. నా కంటే ముందు తొలి ఓవర్ వేసిన దీపక్ చాహర్‌.. బౌన్స్, స్వింగ్ రాబట్టడంతో నాలో ఉత్సాహం పెరిగింది. బౌలింగ్‌ కోసం బంతి నాకు ఇవ్వగానే.. నా సహజ శైలిలో బౌలింగ్ చేశాను. ఆఫ్ స్టంప్‌కి కొద్దిగా దూరంగా బంతులు విసరడం.. అవి స్వింగ్‌ అవుతున్న దశలో బ్యాట్స్‌మెన్ వాటికి దొరికిపోవడం చకచకా జరిగిపోయాయి. అసలు.. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో నేను అమ్ముడుపోతానని ఊహించలేదు.' అని తెలిపాడు.

ఎట్టకేలకి తనని చెన్నై కొనుగోలు చేసిందని గుర్తు చేసుకున్నాడు. 'ఇక్కడ కోచింగ్ సిబ్బంది, కెప్టెన్ ధోనీ నాకు పూర్తి మద్దతు ఇస్తున్నాడు. వారి అనుభవం నాకు ఉపయోగపడుతోంది' అని లుంగి ఎంగిడి వివరించాడు. వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి 7 గంటలకి తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై పోటీపడనుంది.

Story first published: Tuesday, May 22, 2018, 8:19 [IST]
Other articles published on May 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X