న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆ ముగ్గురిని వదులుకుని పెద్ద తప్పుచేశాం.. వారు జట్టులో ఉండిఉంటేనా!!'

Ness Wadia says If KXIP had those 3 players, we qualifying for the playoffs

ముంబై: యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ ప్లే చేరకుండానే నిష్క్రమించింది. కేవలం ఒక్క మ్యాచ్ ఓటమితో ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌ అవకాశాలను వదులుకుంది. సీజన్‌ మొదటి అర్ధ భాగంలో కేవలం ఒకే ఒక్క విజయం సాధించిన పంజాబ్‌.. క్రిస్ గేల్ రాకతో ఊహించని విధంగా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మ‌ళ్లీ రేసులో నిలిచింది. ఇక క్వాలిఫై కావాలంటే క‌చ్చితంగా గెల‌వాల్సిన చివ‌రి మ్యాచ్‌లో మాత్రం చెన్నై చేతిలో ఓడింది. పంజాబ్ జట్టు ఎంత బాగా ఆడినా.. ఓ ముగ్గురు ప్లేయ‌ర్స్ లేని లోటు మాత్రం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇదే విషయాన్ని పంజాబ్ టీమ్ కో ఓన‌ర్ నెస్‌ వాడియా అభిప్రాయపడ్డారు.

కొందరు అంచనాలను అందుకోలేదు

కొందరు అంచనాలను అందుకోలేదు

నెస్‌ వాడియా తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కోచ్‌లు, సారథులను తరచూ మార్చేవిధానం దెబ్బతీయడంతో కోచ్‌ అనిల్ ‌కుంబ్లే, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ నేతృత్వంలో మూడేళ్ల కాలానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 'ఇప్పుడు జట్టులో కొత్త కోచ్, కొత్త కెప్టెన్‌, కొత్త ఆటగాళ్లు ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి జట్టు బాగా రాణిస్తుంది. కొన్నిసార్లు అలా కుదరదు. ఐపీఎల్ 2021 వేలం సమీపిస్తోంది. ఆ వేలంలో మిడిలార్డర్‌, డెత్‌ బౌలింగ్‌ సమస్యలు పరిష్కరించుకుంటాం. కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు (గ్లెన్ మాక్స్‌వెల్‌, షెల్డన్ కాట్రెల్‌) అంచనాలను అందుకోలేదు' అని వాడియా అన్నారు.

గేల్ అన్ని మ్యాచుల్లో ఆడతాడు

గేల్ అన్ని మ్యాచుల్లో ఆడతాడు

'హార్డ్ హిట్టర్ అయిన క్రిస్‌ గేల్‌కు అన్ని మ్యాచుల్లో అవకాశం ఇవ్వకపోవడం జట్టు యాజమాన్యం నిర్ణయం. అయితే తనకు దొరికిన అవకాశాలను గేల్‌ సద్వినియోగం చేసుకొని మెరుపులు మెరిపించాడు. వచ్చే సీజన్లో ఒకటో మ్యాచ్‌ నుంచే గేల్ ఆడతాడు. గతంలో కోచ్‌లు, సారథులను తరచూ మార్చేవిధానం దెబ్బతీయడంతో.. కోచ్‌ అనిల్ ‌కుంబ్లే, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ నేతృత్వంలో మూడేళ్ల కాలానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. కేవలం ఒక్క మ్యాచు ఓటమితో ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజార్చుకున్నాం' అని నెస్‌ వాడియా పేర్కొన్నారు.

ప్ర‌తి గేమ్‌కు రాహుల్ కెప్టెన్సీ మెరుగైంది

ప్ర‌తి గేమ్‌కు రాహుల్ కెప్టెన్సీ మెరుగైంది

ఐపీఎల్ 2021‌లో తొమ్మిదో జట్టు చేరికపై నెస్ వాడియా స్పందించారు. లీగ్‌పై ఆసక్తి తగ్గనంత వరకు, ఇతర ఫ్రాంచైజీల ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బంది లేనంత వరకు ఫర్వాలేదన్నారు. కేఎల్‌ రాహుల్‌ దూకుడుగా ఆడుతున్నాడని, మూడేళ్లుగా జట్టుకు అండగా ఉంటున్నాడని వాడియా చెప్పారు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ రాహుల్ కెప్టెన్సీ మెరుగైంది. ఇక ఐపీఎల్లో షార్ట్‌రన్‌ వంటి నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉందని, తప్పిదాల వల్ల అన్ని జట్లకూ ఇబ్బందేనని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో అంపైర్‌ తప్పిదంతో పంజాబ్‌ ఖాతాలో ఒక పరుగు చేరలేదు. దాంతో ఆ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

వారు జట్టులో ఉండిఉంటే

వారు జట్టులో ఉండిఉంటే

హైద‌రాబాద్ జట్టు‌కు ఆడిన తంగరసు న‌ట‌రాజ‌న్‌, కోల్‌క‌తాకు ఆడిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, చెన్నైకి ప్రాతినిథ్యం వహించిన సామ్ క‌ర‌న్.. గ‌తంలో పంజాబ్ టీమ్‌లోనే ఉండేవారు. ఈ ముగ్గురూ ఈ సీజ‌న్‌లో వారి జట్ల త‌ర‌ఫున అద్భుతంగా ఆడారు. ఇప్పుడున్న పంజాబ్ టీమ్‌లోనూ మొహమ్మద్ షమీ, నికోలస్ పూర‌న్‌, ర‌వి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్ సింగ్‌లాంటి వాళ్లు బాగానే ఆడినా.. ఆ ముగ్గురూ జ‌త క‌లిసి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని నెస్ ‌వాడియా చెప్పుకొచ్చారు. ఆ ముగ్గురిని వదులుకోవాల్సింది కాదన్నారు.

రూల్స్ మార్చిన ఐసీసీ.. ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది.. భారత్‌ నెం.1 ర్యాంక్ పోయే!!

Story first published: Friday, November 20, 2020, 14:14 [IST]
Other articles published on Nov 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X