న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శభాష్ ఆసిఫ్.. నీలాంటి వాళ్ల వల్లే ఇంకా క్రీడా స్ఫూర్తి బతికుందయ్యా! (వీడియో)

Nepals Wicketkeeper Aasif Sheikh Upholds Spirit Of Cricket, Refuses To Run Out Ireland Batter

న్యూఢిల్లీ: క్రికెట్‌లో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్ ఔట్ చేయడానికి బౌలర్లు, ఫీల్డర్లు శత విధాల ప్రయత్నిస్తుంటారు. కొందరూ అడ్డదారులు కూడా తొక్కుతుంటారు. అయితే బ్యాట్స్‌మన్ ఔట్ చేసే ప్రయత్నంలో ఒక్క మిస్ ఫీల్డ్ చేసినా.. క్యాచ్ నేలపాలు చేసినా మ్యాచ్ ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. కానీ నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ స్టంపౌట్ చేసే అవకాశం వచ్చినా.. వదిలేసాడు. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించకుండా అందరి మనసులను గెలుచుకున్నాడు. మైదానంలో అతను చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. శభాష్ ఆసిఫ్ అంటూ నెటిజన్లంతా కొనియాడుతున్నారు.

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ప్రతీ క్రికెట్ అభిమాని ఆసిఫ్‌ను మెచ్చుకుంటున్నారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ రెండో బంతిని అడైర్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి గాల్లోనే లేచి క్రీజులోనే పడింది. ఇక పరుగు కోసం నాన్‌స్ట్రైకర్‌కు పిలుపునిచ్చిన బ్యాట్స్‌మన్ పరుగెత్తాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్‌మన్‌ను బౌలర్‌ను ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు.

అతను లేచి పరుగెత్తేలోపే బంతి వికెట్ కీపర్ ఆసిఫ్‌ను చేరింది. అయితే అతను మాత్రమే స్టంప్స్‌ను కొట్టకుండా బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చేలా చేసి క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. తమ బౌలర్ వల్లనే అతను కిందపడ్డాడని గ్రహించి స్టంప్స్ కొట్టకుండా నిలబడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. డాక్‌రెల్(28), కాంఫెర్(20) మినహా అంతా విఫలమయ్యారు. నేపాల్ టీమ్‌లో దిపేంద్ర సింగ్ ఐరీ(4/21) నాలుగు వికెట్లు తీసాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

Story first published: Tuesday, February 15, 2022, 16:20 [IST]
Other articles published on Feb 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X