న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో పింక్ టెస్టు ఆడక పోవడానికి అసలు కారణం ఇదీ!

By Nageshwara Rao
Need sufficient time to prepare for day and night Tests: Ravi Shastri to CoA

హైదరాబాద్: ఈ ఏడాది కోహ్లీసేన ఎక్కువగా విదేశీ పర్యటనల్లో బిజీగా గడపనుంది. అందులో భాగంగా ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అడిలైడ్ వేదికగా జరగనున్న తొలి టెస్టును డే/నైట్ టెస్టుగా ఆడించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా బీసీసీఐతో చర్చలు జరిపింది.

అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ మాట్లాడుతూ ఆసీస్ పర్యటనలో గెలుపు కోసమే బీసీసీఐ డే/నైట్‌ టెస్టుకు ఒప్పుకోవడం లేదని, భవిష్యత్తులో టెస్టుల పరిస్థితి గురించి ఆలోచించడం లేదని వ్యాఖ్యానించాడు.

ఆతిథ్య దేశానికే ఎక్కువ స్వేచ్ఛ

ఆతిథ్య దేశానికే ఎక్కువ స్వేచ్ఛ

మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేయడంలో ఆతిథ్య దేశానికే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు, ఎక్కడ ఆడాలనేది ఆతిథ్య దేశం నిర్ణయానికే వదిలేయాలని సూచించారు. అయితే భారత్‌ ఎందుకు గులాబీ బంతి టెస్టుల్ని ఆడనని చెప్పడానికి కారణం బిజీ షెడ్యూలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

రవిశాస్త్రితో మాట్లాడిన సీఓఏ సభ్యులు

రవిశాస్త్రితో మాట్లాడిన సీఓఏ సభ్యులు

డే/నైట్‌ టెస్టు గురించి కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పాలకుల కమిటీ సభ్యులు టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో మాట్లాడినట్లు సమాచారం. ఈ సమావేశంలో రవిశాస్త్రి బిజీ షెడ్యూల్‌ కారణంగా మన ఆటగాళ్లు గులాబీ రంగు బంతితో ప్రాక్టీస్‌ చేసేందుకు సమయం దొరకడం లేదని చెప్పాడంట.

ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేయాలి

ఫ్లడ్ లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేయాలి

డే/నైట్ టెస్టు ఆడాలంటే కనీసం 12 నుంచి 18 నెలల పాటు లైట్ల వెలుతురులో ప్రాక్టీస్‌ చేయాలి. ప్రస్తుతం వరుస సిరీస్‌ల కారణంగా ఇది టీమిండియాకు కుదరడం లేదని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ సభ్యులు వెంటనే బీసీసీఐకి అధికారికంగా లేఖ రాశారు.

ప్రాక్టీస్‌కు సరైన సమయం లేదు

ప్రాక్టీస్‌కు సరైన సమయం లేదు

'ఏప్రిల్‌ 12న భారత జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో పింక్‌ టెస్టుపై చర్చించింది. ప్రాక్టీస్‌కు సరైన సమయం లేదు. జట్టు సభ్యులు, మేనేజ్‌మెంట్‌ దీనిపై పూర్తి విముఖంగా ఉంది' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 19 వరకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

Story first published: Saturday, May 5, 2018, 10:49 [IST]
Other articles published on May 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X