న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రెడిట్ అంతా గంభీర్‌కే: విండిస్ పర్యటనకు ఎంపికవడంపై నవదీప్ షైనీ

India's West Indies Tour 2019 : Navdeep Saini Will Set His Mark On The Big Stage Of West Indies Tour
 Navdeep Saini, fast and furious, set to make his mark on the big stage

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దేందు గాను వెస్టిండిస్ పర్యటనకు సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో పాటు బౌలింగ్‌లో నవదీప్ షైనీ, రాహుల్ చహర్, దీపక్ చహర్ వంటి కొత్త వారికి అవకాశమిచ్చారు.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

విండిస్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో అందరి దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తోన్న బౌలర్లలో నవదీపై షైనీ ఒకడు. 26 ఏళ్ల నవదీప్ షైనీ గంటలకు 150 kmphతో బంతిని విసరగలడు. వెస్టిండిస్-ఏ జట్టుతో జరిగిన ఐదు వన్డేల అనధికార సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. తాజా ఎంపికతో టీమిండియాకు ఆడాలన్న అతడి కోరిక నెరవేరబోతోంది.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో సైతం నవదీప్ షైనీ తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ(154.23 kmph) తర్వాత అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రెండో ఆటగాడిగా నవదీప్ షైనీ 152.85 kmph రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్‌లో గత కొంతకాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు.

ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుకు

ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుకు

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన నవదీపై షైనీ 11 వికెట్లు పడగొట్టడంతో పాటు 141 డాట్ బాల్స్ విసిరాడు. దీంతో ఐపీఎల్ 12వ సీజన్‌లో టాప్-5 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. నిజానికి లెధర్ బాల్‌తో 2013 వరకు నవదీప్ షైనీ పెద్దగా క్రికెట్ ఆడింది లేదు.

టెన్నిస్ బాల్‌తో క్రికెట్ మ్యాచ్‌లు

టెన్నిస్ బాల్‌తో క్రికెట్ మ్యాచ్‌లు

తన హౌం టౌన్‌లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడే నవదీప్ షైనీ ఒక్కో మ్యాచ్‌కి రూ. 200 సంపాదించేవాడు. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు 15 నిమిషాల నెట్ సెషన్ అతడి క్రికెట్ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అందుకే గౌతమ్ గంభీర్ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని షైనీ చెప్పుకుంటుంటాడు.

క్రెడిట్ అంతా గంభీర్‌కే

క్రెడిట్ అంతా గంభీర్‌కే

తనలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించినందుకు గాను క్రెడిట్ మొత్తం గంభీర్‌కే దక్కుతుందని అన్నాడు. ఈ సందర్భంగా నవదీప్ షైనీ మాట్లాడుతూ "నా కెరీర్‍‌లో గంభీర్ భయ్యా సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే, అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది" అని అన్నాడు.

నా కుటుంబం తర్వాత అంతా గంభీరే

నా కుటుంబం తర్వాత అంతా గంభీరే

"నా కుటుంబం తర్వాత నాకు అంతా గంభీర్ బయ్యానే. నేను ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నాను, అంతకుముందు హర్యానాలో ఆడేటప్పుడు నేను ఎవరికీ తెలియదు. గంభీర్ భయ్యానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఢిల్లీ తరుపున ఆడేలా సహకారం అందించాడు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. గంభీర్ నాకు మద్దతు ఇచ్చిన విధానం, నా సామర్ధ్యాలపై నమ్మకం, నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేను" అని నవదీప్ షైనీ అన్నాడు.

షైనీతో పాటు ఖలీల్ అహ్మద్‌లు నెట్ బౌలర్లుగా

షైనీతో పాటు ఖలీల్ అహ్మద్‌లు నెట్ బౌలర్లుగా

ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో నవదీప్ షైనీతో పాటు ఖలీల్ అహ్మద్‌లు నెట్ బౌలర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇద్దరు బౌలర్లే వెస్టిండిస్ పర్యటనకు సైతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనుండగా మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీస్ అతిథ్యమివ్వనుంది.

వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా

టీ20 జట్టు:

కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, మనీశ్, పంత్(వికెట్ కీపర్), జడేజా, సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, భువనేశ్వర్, కృనాల్, ఖలీల్, సైనీ.

వన్డే జట్టు:

కోహ్లీ(కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, అయ్యర్, పంత్(వికెట్ కీపర్), మనీశ్, జడేజా, కుల్దీప్, చాహల్, జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్, సైనీ.

Story first published: Monday, July 22, 2019, 15:35 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X