న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు మానసిక సమస్య ఉందని మొదట గుర్తించింది ఎవరో తెలుసా?: మ్యాక్స్‌వెల్

My partner was the first person who noticed it: Glenn Maxwell opens up on mental health issues


హైదరాబాద్: మానసిక సమస్యలు కారణంగా క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విరామాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అతడి మానసిక సమస్యను గుర్తించిన మొదటి వ్యక్తి అతడి పార్టనరేనని తాజా మీడియా సమావేశంలో వెల్లడించాడు. త్వరలో ఆరంభం కానున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు సారథ్యం వహించేందుకు మ్యాక్స్‌వెల్ సిద్ధమయ్యాడు.

ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ "నా మానసిక సమస్యను అర్థం చేసుకుని కోలుకోవడానికి నిరవధిక విరామాన్ని ఇచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు ధన్యవాదాలు" తెలియజేశాడు. ఇక, తన పునరాగమనంపై "నేను కొంతకాలం తర్వాత తిరిగి స్వింగ్‌లోకి వచ్చేశా. త కొంత కాలంగా నేను మానసికంగా చాలా సతమతమయ్యా. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది" అని చెప్పాడు.

85 ఏళ్ల రంజీ చరిత్రలో మ్యాచ్ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించిన జార్ఖండ్85 ఏళ్ల రంజీ చరిత్రలో మ్యాచ్ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించిన జార్ఖండ్

నేను ఎందుకు విరామం

నేను ఎందుకు విరామం

"నేను ఎందుకు విరామం తీసుకున్నాను అనేదానికి ఒక పెద్ద కారణం ఉంది. అదేమిటంటే, గత ఎనిమిది నెలలుగా విరామం లేకుండా తిరగడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయా. భారీ భారం మోస్తున్నట్లు అనిపించేది. ఆ కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోయా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు" అని మ్యాక్స్‌వెల్ వెల్లడించాడు.

నేను ఎవరితోనూ చెబుతుంటే

నేను ఎవరితోనూ చెబుతుంటే

"ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెబుతుంటే నా పార్టనర్‌ విశ్రాంతి తీసుకోమని చెప్పింది. నా సమస్యను గుర్తించిన మొదటి వ్యక్తి నా పార్టనరే. ఇప్పుడు నా భుజాలపై నుంచి భారీ భారం దిగినట్లు ఉంది. నా సమస్యను అర్థం చేసుకుని నాకు విశ్రాంతినిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ విక్టోరియా మరియు (మెల్బోర్న్) స్టార్స్‌కు నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను." అని మ్యాక్స్‌వెల్ అన్నాడు.

ఉదయం సెంచరీ చేసి సాయంత్రం పానీ పూరీ అమ్మేవాడిని: యశస్వి జైస్వాల్ గుర్తిండిపోయే ప్రయాణం!

క్రికెట్ ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు

క్రికెట్ ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు

విక్టోరియా షీల్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మ్యాక్స్‌వెల్ మూడు విక్టోరియా ప్రీమియర్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత పలు అంశాల్లో కూడా పాల్గొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో తనకు మానసిక ఇబ్బందులున్నాయని, దాంతో కొంతకాలం విశ్రాంతి కావాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరిన సంగతి తెలిసిందే. అతడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఏ అతడికి విరామాన్ని ఇచ్చింది.

Story first published: Friday, December 13, 2019, 16:39 [IST]
Other articles published on Dec 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X