న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నా.. నేరుగా ముంబై తరఫున ఆడా'

Mumbai Indians pacer Trent Boult says I haven’t played cricket in probably six months

అబుదాబి: కరోనా వైరస్ కారణంగా దాదాపు ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, నేరుగా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2020లో మ్యాచ్‌ ఆడాను అని న్యూజిలాండ్‌ స్టార్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ చెప్పాడు. టీ20ల్లో డెత్‌ ఓవర్లు వేయడమే అసలైన సవాల్‌ అని బౌల్ట్‌ అన్నాడు. లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 162 లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చివరకు 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది.

ఆరు నెలల నుంచి క్రికెట్‌ ఆడలేదు:

ఆరు నెలల నుంచి క్రికెట్‌ ఆడలేదు:

తాజాగా ట్రెంట్‌ బౌల్ట్‌ మాట్లాడుతూ... 'న్యూజిలాండ్‌లో మంచి శీతాకాలం ఇప్పుడు. అక్కడి వాతావరణం, దుబాయ్‌లో వాతావరణం మధ్య చాలా తేడా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. దీనికి తోడు దాదాపు ఆరు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. నేరుగా ముంబై తరఫున మ్యాచ్‌ ఆడాను. నా ప్రదర్శనపై నేను సంతోషంగా ఉన్నాను. ప్రత్యర్థి ముందు మేం నిర్దేశించాలనుకున్న లక్ష్యం కంటే తక్కువ పరుగులు చేశాం' అని అన్నాడు.

డెత్‌ ఓవర్లు వేయడమే అసలైన సవాల్:

డెత్‌ ఓవర్లు వేయడమే అసలైన సవాల్:

'బౌలింగ్‌ విషయానికి వస్తే.. ఆఖరి ఓవర్లో చెన్నైకి ఐదు పరుగులు అవసరం అయ్యాయి. పైగా క్రీజులో మంచి ఫామ్‌లో ఉన్న ఫాఫ్ డుప్లెసిస్‌ ఉన్నాడు. ఆ సమయంలో సరైన ఏరియాలో బంతులు వేయడం తప్ప ఇంకేం చేయలేం. టీ20ల్లో డెత్‌ ఓవర్లు వేయడమే అసలైన సవాల్. అలాంటి సమయాల్లో నేను యార్కర్‌ బంతులు వేసేందుకు ప్రయత్నిస్తా. బంతి వేగాన్ని తగ్గించి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడితే పరుగులు ఆపవచ్చు. ఇకపై మ్యాచ్‌ మొదట్నుంచి మంచి ప్రదేశాల్లో బంతులు వేస్తూ ప్రణాళికలు అమలు చేస్తాం' అని బౌల్ట్‌ చెప్పాడు.

బుమ్రా ప్రపంచస్థాయి బౌలర్‌:

బుమ్రా ప్రపంచస్థాయి బౌలర్‌:

జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శన తననేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదని, అతను ప్రపంచస్థాయి బౌలర్‌ అని ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. బుమ్రా త్వరలోనే తిరిగి లయ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. అతను జట్టుకు పెద్ద ఆటగాడని,చాలా ముఖ్యమైన బౌలర్ అని పేర్కొన్నాడు. అతనితో కలిసి బౌలింగ్ సంతోషమన్నాడు. కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ అండ్రీ రసెల్‌ విధ్వంసకర ఆటగాడని, అతనిని ఎదుర్కోవడం అంటే ఛాలెంజ్‌ అని బౌల్ట్‌ అన్నాడు.

2 ఓవర్లలో 8 పరుగులు:

2 ఓవర్లలో 8 పరుగులు:

షేక్ జాయెద్ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హిట్టర్లు రసెల్, నరైన్, మోర్గాన్ కోల్‌కతా తరఫున బరిలోకి దిగారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైతో ఆడిన జట్టుతోనే ముంబై బరిలోకి దిగుతోంది. ముంబై 2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. డికాక్ ఔట్ అయ్యాడు.

KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. హిట్టర్లతో బరిలోకి!!

Story first published: Wednesday, September 23, 2020, 19:58 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X